Passwords Leak : 2025లో లీకైన టాప్ 10 పాస్‌వర్డ్‌లు ఇవే... మీ ఖాతా ప్రమాదంలో ఉండొచ్చు!
ఈ వార్తాకథనం ఏంటి
మీ పాస్‌వర్డ్ హ్యాకర్లకు ఇప్పటికే తెలిసిపోయిందేమో.. అవును, మీరు చదివింది నిజమే! సులభంగా గుర్తు పెట్టుకోగలిగే పాస్‌వర్డ్‌లు వాడటం వల్ల మీ వ్యక్తిగత డేటా సైబర్ నేరగాళ్లకు చిక్కే ప్రమాదం ఎక్కువగా ఉందని తాజా సర్వేలు చెబుతున్నాయి. సైబర్ సెక్యూరిటీ నిపుణులు ఎన్నిసార్లు హెచ్చరించినప్పటికీ, ఇంటర్నెట్ వినియోగదారుల్లో చాలా మంది పాస్‌వర్డ్‌ల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని 2025లో కంపారిటెక్ (Comparitech) విడుదల చేసిన తాజా రిపోర్టులో వెల్లడైంది. ఆ రిపోర్టు ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఉపయోగించే పాస్‌వర్డ్ మరోసారి "123456"గానే నిలిచింది. 2025లో లీక్ అయిన 2 బిలియన్‌కి పైగా పాస్‌వర్డ్‌లను పరిశీలించిన తరువాత ఈ వివరాలు బయటపడ్డాయి.
Details
ప్రపంచంలో అత్యధికంగా వాడే టాప్ 10 పాస్‌వర్డ్‌లు ఇవి:
మిలియన్ల కొద్దీ అకౌంట్లు 123456, 12345678, 123456789 వంటి పాస్‌వర్డ్‌లను వాడుతున్నట్టు గుర్తించారు. టాప్ టెన్ ర్యాంకింగ్స్‌లో "admin", "password", "12345" వంటి పదాలు కూడా ఎక్కువగా ఉన్నాయని వెల్లడైంది. 1. 123456 2. 12345678 3. 123456789 4. admin 5. 1234 6. Aa123456 7. 12345 8. password 9. 123 10. 1234567890 రిపోర్టు ప్రకారం, టాప్ 1,000 పాస్‌వర్డ్‌లలో సుమారు 25 శాతం కేవలం నంబర్లు మాత్రమే ఉన్నాయి. వాటిలో 38.6 శాతం "123" సీక్వెన్స్‌తో ప్రారంభమవుతాయి. కొందరు యూజర్లు కొద్దిగా సృజనాత్మకంగా వ్యవహరించినా, ఎక్కువమంది ఇంకా పాత, సులభంగా ఊహించగలిగే పదాలనే వాడుతున్నారు.
Details
టాప్ 100లో 53వ స్థానంలో
'password' అనే పదం లేదా దానికి సమానమైన వేరియేషన్స్ సుమారు 4 శాతం పాస్‌వర్డ్‌లలో కనిపించాయి. "admin" సుమారు 2.7 శాతం పాస్‌వర్డ్‌లలో ఉండగా qwerty, welcome, minecraft వంటి పదాలు కూడా ఎక్కువగా వాడబడ్డాయి. 'minecraft' పాస్‌వర్డ్ దాదాపు 90 వేల సార్లు లీక్ అయినట్లు రిపోర్టు పేర్కొంది. ఇక భారతీయుల విషయానికి వస్తే 'India@123' అనే పాస్‌వర్డ్ టాప్ 100లో 53వ స్థానంలో నిలిచింది. సైబర్ నిపుణుల సూచన ప్రకారం, పాస్‌వర్డ్ పొడవు కనీసం 12 అక్షరాలు ఉండాలి. పాస్‌వర్డ్ లెన్త్ ఎక్కువగా ఉంటే దాన్ని క్రాక్ చేయడం హ్యాకర్లకు కష్టమవుతుంది. కానీ కంపారిటెక్ రిపోర్టు ప్రకారం, 65.8 శాతం పాస్‌వర్డ్‌లు 12 అక్షరాల కన్నా తక్కువగా ఉన్నాయని పేర్కొంది.