JioTele OS: జియోటెలి ఓఎస్‌తో వస్తున్నమొదటి స్మార్ట్ టీవీ ఇదే..లాంచ్ ఆఫర్ కింద ఉచిత JioHotstar సబ్‌స్క్రిప్షన్ కూడా..
ఈ వార్తాకథనం ఏంటి
జియోటెలి ఆపరేటింగ్ సిస్టమ్ (OS) తో మొట్టమొదటి స్మార్ట్ టీవీ మార్కెట్లోకి ప్రవేశించింది.
జియోటెలి OS ఆధారంగా పనిచేసే ఈ తొలి స్మార్ట్ టీవీని థామ్సన్ భారతదేశంలో విడుదల చేసింది.
ఈ టీవీలో 43 అంగుళాల క్యూఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. అదనంగా, జియో అభివృద్ధి చేసిన ప్రత్యేక ఆపరేటింగ్ సిస్టమ్ దీనిలో పొందుపరిచారు.
ఈ OS వినియోగదారుల స్మార్ట్ టీవీ అనుభవాన్ని పూర్తిగా కొత్తస్థాయికి తీసుకెళ్లనుంది.
ధర
జియోటెలి OS ఆధారిత థామ్సన్ 43 అంగుళాల క్యూఎల్ఈడీ టీవీని 2025 జనవరి 21 నుండి Flipkart ద్వారా కొనుగోలు చేయవచ్చు.
దీని ప్రారంభ ధర రూ.18,999 గా నిర్ణయించబడింది. అయితే, అదనపు డిస్కౌంట్ల వివరాలను ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.
వివరాలు
లాంచ్ ఆఫర్‌లో ఉచిత సేవలు
ఈ స్మార్ట్ టీవీని కొనుగోలు చేసే వినియోగదారులకు ప్రత్యేక లాంచ్ ఆఫర్‌లో భాగంగా కొన్ని ఉచిత సేవలు అందించబడతాయి.
జియోసావన్ మ్యూజిక్ స్ట్రీమింగ్ సేవ 3 నెలల పాటు ఉచితంగా లభించనుంది.
అదేవిధంగా,జియోగేమ్స్ సేవను 1 నెల పాటు ఉచితంగా వినియోగించుకోవచ్చు.
అలాగే,Swiggy ద్వారా రూ.499 లేదా అంతకంటే ఎక్కువ విలువైన ఫుడ్ ఆర్డర్ చేస్తే రూ.150 తగ్గింపు పొందే అవకాశం ఉంది.
స్మార్ట్ టీవీ ఫీచర్లు
ఈ టీవీ డీప్ కాంట్రాస్ట్,వైబ్రెంట్ కలర్స్ కలిగి ఉండటంతో అద్భుతమైన పిక్చర్ క్వాలిటీని అందిస్తుంది.
వేగవంతమైన ఇంటర్ఫేస్,AI ఆధారిత కంటెంట్ సెర్చ్,అన్ని ప్రముఖ యాప్స్‌కు యాక్సెస్ వంటి ప్రత్యేకమైన ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
వివరాలు
డిజైన్ & స్ట్రీమింగ్ సపోర్ట్
ఈ టీవీలో వాయిస్ సెర్చ్,స్క్రీన్ మిర్రరింగ్ వంటి ఆధునిక ఫీచర్లు అందించబడ్డాయి.అలాగే, కనెక్టివిటీ కోసం బహుళ HDMI & USB పోర్టులు అందుబాటులో ఉన్నాయి.
ఈ టీవీ బెజెల్ లెస్ డిజైన్,అల్లాయ్ స్టాండ్ తో స్టైలిష్ లుక్ కలిగి ఉంది.
స్లిమ్ ఆకృతితో మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది.Netflix, Prime Video, JioCinema, YouTube లాంటి ప్రముఖ స్ట్రీమింగ్ యాప్స్ ముందుగా ఇన్‌స్టాల్ చేయబడ్డాయి.
జియోటెలి OS విశేషాలు
జియోటెలి OS గూగుల్ ఆండ్రాయిడ్ తరహాలో ప్రత్యేకంగా అభివృద్ధి చేయబడింది.
ఇందులో హై క్వాలిటీ ఆడియో-వీడియో సపోర్ట్, వాయిస్ అసిస్టెంట్, AI ఆధారిత కంటెంట్ సిఫారసులు అందించబడతాయి.
అదనంగా, కొత్త యాప్స్, భద్రతా ఫీచర్లు, టెక్నాలజీ అప్‌గ్రేడ్‌లకు సంబంధించిన రెగ్యులర్ అప్డేట్స్ అందుబాటులో ఉంటాయి.
వివరాలు
ఈ OS ద్వారా క్లౌడ్ గేమింగ్
ఈ OS ద్వారా క్లౌడ్ గేమింగ్ ను కూడా ఆస్వాదించవచ్చు.
టీవీ వినియోగదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని Netflix, Prime Video, JioCinema, YouTube వంటి ప్రధాన స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లకు పూర్తి సపోర్ట్ అందించబడింది.
జియోటెలి OS ఆధారిత ఈ స్మార్ట్ టీవీ తక్కువ ధరలో అధునాతన ఫీచర్లు అందించడంతో వినియోగదారులను ఆకట్టుకునే అవకాశముంది.
Flipkart ద్వారా జనవరి 21 నుండి కొనుగోలు చేయవచ్చే ఈ టీవీ, అత్యుత్తమ స్మార్ట్ టీవీల జాబితాలో నిలిచే అవకాశం ఉంది.