LOADING...
Year Ender 2025:ఈ ఏడాది సోషల్ మీడియాలో సెన్సేషన్స్.. నానో బనానా నుండి కిస్ క్యామ్ వరకు ఈ ట్రెండ్స్ వైరల్!
ఈ ఏడాది సోషల్ మీడియాలో సెన్సేషన్స్.. నానో బనానా నుండి కిస్ క్యామ్ వరకు ఈ ట్రెండ్స్ వైరల్!

Year Ender 2025:ఈ ఏడాది సోషల్ మీడియాలో సెన్సేషన్స్.. నానో బనానా నుండి కిస్ క్యామ్ వరకు ఈ ట్రెండ్స్ వైరల్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 20, 2025
10:23 am

ఈ వార్తాకథనం ఏంటి

ఈ ఏడాది అంతర్జాలం ఏఐతో కదుల్లాడింది. జెమిని, పెర్ ప్లెక్నిటీ, గ్రోక్, డీప్ సీక్ వంటి ఏఐ టూల్స్ ప్రపంచాన్ని షేక్ చేసాయి. వీటితోపాటు నానో బనానా, గిబ్లీ స్టైల్ వంటి ట్రెండ్లు యూజర్లను కంప్యూటర్‌ ముందు కట్టివేసాయి. టెక్నాలజీ పరంగా ఇవి అద్భుతమైనవే అయినా, ప్రపంచం మొత్తాన్ని ఇంటర్నెట్‌ లోనే ఏకకాలంలో అతుక్కుపోయేలా చేసిన అంశం మాత్రం 'కిస్ కామ్ చావోస్'.

Details

నానో బనానా ట్రెండ్ 

టెక్నాలజీ ప్రపంచంలో ప్రతి రోజూ కొత్త వింత పుట్టుతోంది. గూగుల్ జెమినీ ఇటీవల నానో బనానా అనే ఏఐ ఇమేజ్‌ ఎడిటింగ్ టూల్‌ను విడుదల చేసింది. ఇది వాస్తవానికి సూపర్ హిట్‌గా మారింది. యూజర్లు దీన్ని పిచ్చి పద్దతిలో డౌన్లోడ్ చేసుకున్నారు. టెక్స్ట్ ప్రాంప్ట్ లేదా ఫోటో ఇస్తే.. రియలిస్టిక్ 3డీ ఫిగరిన్లు తయారు చేసి ఇస్తుంది. ఇవి చిన్న బొమ్మలాగా, కలెక్టబుల్‌ టాయ్స్ లాగా ఉంటాయి. ప్రస్తుతం ఈ టూల్ 200 మిలియన్లకంటే ఎక్కువ ఫోటోలు సృష్టించింది. నిమిషాల్లోనే 3డీ బొమ్మలు తయారవుతాయి. గూగుల్ జెమినీ 2.5 వెర్షన్ వేగంతో అందరిని ఆకట్టుకుంది.

Details

గిబ్లీ స్టైల్ వింత 

ఈ ఏఐ టెక్నాలజీతో వినియోగదారులు తక్కువ సమయంలో తమ ఫోటోలను యానిమేషన్‌లోకి మార్చవచ్చు. X (ట్విట్టర్), ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్లలో ఈ చిత్రాలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. గిబ్లీ స్టైల్ జపాన్‌ యానిమేషన్ స్టూడియో ఆధారంగా ఉంది. చాట్‌జీపీటీలో లేటెస్ట్ వెర్షన్‌లో ప్రాంప్ట్ ఇచ్చి చిత్రాన్ని గిబ్లీ థీమ్‌లోకి మార్చవచ్చు. కొద్ది రోజుల్లోనే పాపులర్‌గా మారినప్పటికీ, వ్యక్తిగత ఫోటోలను ఇక్కడ ఇవ్వడం డేంజర్, యూజర్లు వాడకాన్ని తగ్గించారు.

Advertisement

Details

 సిక్స్ సవెన్ ('67') పదం హిట్ 

జెన్ జీ, జెన్ ఆల్ఫా, టీనేజ్ వర్గం రోజూ కొత్త పదాలను సృష్టిస్తూ హడావుడి చేస్తున్నారు. ఈ ఏడాది పుట్టిన ప్రత్యేక పదం '67'. దీనిని డిక్షనరీ.కామ్ 'వర్డ్ ఆఫ్ ది ఇయర్' గా ప్రకటించింది. 'సిక్స్ సెవెన్' అని మాత్రమే చదవాలి, సరిగ్గా అర్థం లేదు. ఇది రెడుపెద్ద చేతులతో చేసే సంజ్ఞ, అమెరికా ర్యాపర్ స్క్రిల్లా పాడిన "DootDoot (6 7)" హుక్‌ వర్డ్ నుండి వచ్చిందని భావిస్తున్నారు.

Advertisement

Details

 కిస్ కామ్ గందరగోళం 

సోషల్ మీడియా యుగంలో ఒక చిన్న పొరపాటు లేదా అనుకోని క్షణం జీవితాన్ని తట్టుకోలేనంత కదిలించవచ్చు. ఈ సందర్భంలో కిస్ కామ్ ఘటన ఉదాహరణ. కోల్డ్ ప్లే కంసర్ట్‌లో జంబోట్రాన్‌లో 'కిస్ కామ్' సెగ్మెంట్ సమయంలో ఒక జంట ఫోకస్‌లోకి వచ్చింది. ఆ జంటలో ఆస్ట్రోనమర్ CEO ఆండీ బైరన్, చీఫ్ పీపుల్ ఆఫీసర్ క్రిస్టిన్ కాబట్ ఉన్నారు. ఇద్దరికీ వేరు వేరు కుటుంబాలు ఉండడంతో, ఈ ఘటన సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది, వారి జీవితాలూ తల్లకిందులు అయ్యాయి. 2025లో టెక్, సోషల్, కల్చర్ ఇలా అన్ని రంగాలూ ఏఐ, ట్రెండ్స్, సోషల్ మీడియా హ్యాపెనింగ్స్‌తో విప్లవాత్మకంగా మారాయి.

Advertisement