
ఈ రోజు రాత్రి ఆకాశంలో కనివిందు చేయనున్న బృహస్పతి, హాఫ్ మూన్
ఈ వార్తాకథనం ఏంటి
ఆకాశంలో సోమవారం రాత్రి ఆసక్తికర పరిణామం చోటుచేసుకోనుంది. బృహస్పతి, చంద్రుడు అర్థాకారంలో కలిసి కనిపించనున్నారు.
బృహస్పతి మన సౌర వ్యవస్థలో అతిపెద్ద గ్రహం. ఇది చంద్రుడి కింద సోమవారం రాత్రి చాలా ప్రకాశవంతంగా కనిపించనుంది.
అలాగే బృహస్పతి రాబోయే వారాల్లో మరింత ప్రకాశవంతంగా కనిపించనుంది.
టెలిస్కోప్ లేదా బైనాక్యులర్‌లను ఉపయోగించి ఈ అరుదైన దృశ్యాన్ని చూడవచ్చు. ఈ సందర్భంగా ఐయో, గనిమీడ్, యూరోపా, కాలిస్టో పేరుతో ఉన్న చంద్రులను కూడా ఖగోళంలో చూడవచ్చు.
సూర్యుని చుట్టూ భూమి తిరుగుతున్న నేపథ్యంలో బృహస్పతి స్థానం కాలక్రమేణా మారుతుంది.
ప్రస్తుతం 40.2 కాంతి నిమిషాల దూరంలో ఉన్న బృహస్పతి, శరదృతువు కాలం నాటికి అది 33.1 కాంతి నిమిషాలకు తగ్గనుంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ప్రకాశవంతంగా కనిపించనున్న బృహస్పతి
See Jupiter and the half moon join up in the night sky tonight https://t.co/acFxtg7M6r pic.twitter.com/jEuighXsHL
— SPACE.com (@SPACEdotcom) August 7, 2023