Solar Eclipse : సూర్య గ్రహణాన్ని ఆదిత్య ఎల్ 1 శాటిలైట్ ఎందుకు మిస్సయ్యిందంటే...
ఈ వార్తాకథనం ఏంటి
నేడు సంపూర్ణ సూర్య గ్రహణం.
సూర్యునిపై అధ్యయనానికి పంపిన సోలార్ అబ్జర్వేటరీ, ఆదిత్య ఎల్ 1 శాటిలైట్ ఈ సంపూర్ణ సూర్య గ్రహణాన్ని మాత్రం మిస్ కానుంది.
అయితే నార్త్ అమెరికాలో మాత్రం పూర్తిగా సూర్యగ్రహణం కనిపించనుంది.
సంపూర్ణ సూర్యగ్రహణం అమెరికా వాసులకు కనిపించడం చాలా అరుదు.
వందేళ్లలో తొలిసారిగా న్యూయార్క్ స్టేట్ లో ని వెస్ట్రన్, ఈస్ట్రన్ ప్రాంతాల్లో సంపూర్ణ సూర్యగ్రహణం కనిపించనుంది.
సూర్యునికి చంద్రుడు మెల్లగా అడ్డు వస్తూ పూర్తిగా కమ్మేసినప్పుడు అమెరికా అంతటా కొద్దిసేపు చీకటి పడనుంది.
ఇది అమెరికా వాసుల్ని మరింత అబ్బుర పరచనుంది. సంపూర్ణ సూర్యగ్రహణం ఉత్తర అమెరికా (North America) అంతటా కనిపిస్తుంది.
Aditya L1
కెనడా, మెక్సికో వాసులకు కూడా గ్రహణం కనిపిస్తుంది..
గ్రహణం వీడటం మెక్సికో, అమెరికా, కెనడా వాసులకు కూడా కనిపిస్తుందని నాసా వెల్లడించింది.
భారత్‌కు చెందిన ఆదిత్య ఎల్1 శాటిలైట్ ఈ ఘటనను చిత్రీకరించలేదు.
ఈ శాటిలైట్ సూర్యుడిని నిరంతరాయంగా 24x7, 365 రోజుల వీక్షణను అందించే ప్రదేశంలో తగిన విధంగా భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఉంచింది.
గ్రహణం కారణంగా శాటిలైట్ వీక్షణ ఎప్పుడూ నిరోధించబడకుండా చూసేందుకు భారత శాస్త్రవేత్తలు ఒక స్థలాన్ని ఎంచుకున్నారు.
అందువల్లే సూర్యగ్రహణాన్ని ఇది ప్రస్తుతం క్యాప్చర్ చేయలేదు.
Solar Eclise
చంద్రుడు శాటిలైట్ వెనుక ఉన్నందునే...
లాగ్రాంజ్ పాయింట్ 1 (L1 పాయింట్) వద్ద చంద్రుడు శాటిలైట్ వెనుక ఉన్నందున ఆదిత్య L1 శాటిలైట్ సూర్యగ్రహణాన్ని చూడలేదు.
భూమిపై కనిపించే గ్రహణానికి ఆ ప్రదేశంలో పెద్దగా ప్రాముఖ్యత లేదు అని ఇస్రో ఛైర్మన్ S. సోమనాథ్ చెప్పారు.
భారతీయ ఆదిత్య L1 వ్యోమనౌక భూమి నుండి 1.5 మిలియన్ కి.మీ దూరంలో ఉన్న సూర్య-భూమి వ్యవస్థ యొక్క లాగ్రాంజ్ పాయింట్ 1 (L1) చుట్టూ ఒక హాలో కక్ష్యలో ఉంచబడింది.
L1 పాయింట్ చుట్టూ ఉన్న హాలో కక్ష్యలో ఉంచిన ఉపగ్రహం ఎటువంటి గ్రహణాలు లేని సూర్యుడిని నిరంతరం వీక్షించేలా శాస్త్రవేత్తలు రూపొందించారు.