LOADING...
Nobel Prize in physics 2025: భౌతికశాస్త్రంలో ఈ ఏడాది ముగ్గురికి నోబెల్
భౌతికశాస్త్రంలో ఈ ఏడాది ముగ్గురికి నోబెల్

Nobel Prize in physics 2025: భౌతికశాస్త్రంలో ఈ ఏడాది ముగ్గురికి నోబెల్

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 07, 2025
03:51 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఈ సంవత్సరం భౌతిక శాస్త్రంలో నోబెల్‌ అవార్డు ముగ్గురికి లభించింది. అమెరికా దేశానికి చెందిన జాన్‌ క్లార్క్‌, మైఖేల్‌ హెచ్‌. డెవొరెట్‌, జాన్‌ ఎం. మార్టినిస్‌లకు ఈ గౌరవం లభించింది. వీరికి ఈ అవార్డు లభించిన ప్రధాన కారణం ఎలక్ట్రిక్‌ సర్క్యూట్‌లలో మాక్రోస్కోపిక్‌ క్వాంటం మెకానికల్‌ టన్నెలింగ్‌ (Macroscopic Quantum Mechanical Tunneling)ఎనర్జీ క్వాంటైజేషన్‌(Energy Quantization) రంగాల్లో చేసిన అత్యున్నతమైన పరిశోధనలకు కావడం. స్టాక్‌హోమ్‌లోని రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ ఈ విజేతలను ప్రకటించింది. గత సంవత్సరం(2024) భౌతిక శాస్త్రంలో ఆర్టిఫిషియల్‌ న్యూరల్‌ నెట్‌వర్క్‌లు(Artificial Neural Networks) మెషిన్‌ లెర్నింగ్‌ (Machine Learning)రంగాల్లో చేసిన ప్రగతికి ఇద్దరు శాస్త్రవేత్తలకు నోబెల్‌ పురస్కారం లభించిందని ప్రకటించబడింది. ఆ వ్యక్తులు జాన్‌ జె.హోప్‌ఫీల్డ్‌, జెఫ్రీ ఈ. హింటన్‌.

వివరాలు 

 95 ఏళ్ల వయసులో నోబెల్‌ అందుకున్న వ్యక్తిగా  చరిత్రలోకెక్కిన ఆర్థర్‌ అష్కిన్

మొత్తంగా , 1901 నుండి 2024 వరకు భౌతిక శాస్త్రంలో 118 సార్లు భౌతికశాస్త్రంలో నోబెల్‌ను ప్రకటించగా.. వీటిలో 226 మంది పరిశోధకులు ఈ గౌరవాన్ని పొందారు. ఆవార్డు పొందిన వారిలో, లారెన్స్‌ బ్రాగ్‌ 25 ఏళ్ల వయసులో ఈ పురస్కారాన్ని పొందిన అతిపిన్న వయస్కుడు గా నిలిచాడు. అలాగే,ఆర్థర్‌ అష్కిన్‌ 95 ఏళ్ల వయసులో నోబెల్‌ అందుకున్న వ్యక్తిగా చరిత్రలో నిలిచారు. ఇక వైద్య రంగంలో నోబెల్‌ అవార్డు ప్రకటనలు అక్టోబర్‌ 6 (సోమవారం)నుండి ప్రారంభమై,అక్టోబర్‌ 13 వరకు కొనసాగనున్నాయి. బుధవారం రసాయనశాస్త్రం విభాగంలో విజేతలను ప్రకటిస్తారు. గురువారం సాహిత్య విభాగంలో, శుక్రవారం శాంతి బహుమతి, అలాగే అక్టోబర్‌ 13న ఆర్థికశాస్త్ర విభాగంలో అవార్డును పొందిన వారి వివరాలను ప్రకటిస్తారు.

Advertisement