ట్విట్టర్ బ్లూ టిక్ కోసం నెలకు రూ.650 చెల్లించాల్సిందే
ట్విట్టర్ బ్లూ సబ్‌స్క్రిప్షన్ భారతదేశంలో ప్రారంభమైంది. ఇది ట్వీట్‌లను సవరించగల సామర్థ్యం, వెబ్ ద్వారా HD రిజల్యూషన్‌లో వీడియోలను పోస్ట్ చేయడం, కొత్త ఫీచర్‌లకు ముందస్తు యాక్సెస్ వంటి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. వెబ్ వెర్షన్ కు బ్లూ టిక్ పొందడానికి నెలకు రూ. 650 చెల్లించి, వినియోగదారులు తమ ఫోన్ నంబర్‌లను ధృవీకరించాల్సి ఉంటుంది. వెబ్ ద్వారా ట్విట్టర్ బ్లూ సబ్‌స్క్రిప్షన్ ధర నెలకు రూ. 650 చెల్లించాలి. ఐఫోన్, ఆండ్రాయిడ్ యాప్‌ల ద్వారా కొనుగోలు చేసినప్పుడు నెలకు రూ. 900 చెల్లించాలి. వార్షిక ప్లాన్, వెబ్ ద్వారా కొనుగోలు చేసినప్పుడు సంవత్సరానికి రూ. 6,800 అంటే నెలకు రూ. 566.67 పడుతుంది.
ఆపిల్, గూగుల్ యాప్ స్టోర్‌ల ద్వారా కొంటే యాప్ ధరలు ఎక్కువగా ఉన్నాయి
ఆపిల్, గూగుల్ యాప్ స్టోర్‌ల ద్వారా కొనుగోళ్లకు యాప్ ధరలు ఎక్కువగా ఉన్నాయి. భారత్‌తో పాటు, బ్రెజిల్, ఇండోనేషియాలో కూడా ట్విట్టర్ బ్లూ ప్రారంభమైంది. ఈ సేవ ప్రస్తుతం US, కెనడా, జపాన్, UK, సౌదీ అరేబియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, పోర్చుగల్, స్పైయిన్‌తో సహా 15 దేశాలలో అందుబాటులో ఉంది. సైన్ అప్ చేయడానికి, ముందుగా మీ ఫోన్ నంబర్‌ను ధృవీకరించి, డబ్బును చెల్లించాలి. ట్విట్టర్ బ్లూసభ్యత్వం వచ్చిన తర్వాత, ప్రొఫైల్ ఫోటో, సంస్థ పేరు లేదా వినియోగదారు పేరు (@హ్యాండిల్)కి మార్పులు చేయడం చేస్తే ట్విట్టర్ ఆ ఖాతాను ధృవీకరించే వరకు బ్లూ చెక్‌మార్క్‌ను కోల్పోతుంది. సమీక్ష చేసేవరకు తదుపరి మార్పులు చేయలేరని ట్విట్టర్ పేర్కొంది.