Page Loader
Samsung: శాంసంగ్ W సిరీస్ లో రెండు కొత్త ఫోన్లు.. ఫీచర్లు, కెమెరా వివరాలివే!
శాంసంగ్ W సిరీస్ లో రెండు కొత్త ఫోన్లు.. ఫీచర్లు, కెమెరా వివరాలివే!

Samsung: శాంసంగ్ W సిరీస్ లో రెండు కొత్త ఫోన్లు.. ఫీచర్లు, కెమెరా వివరాలివే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 27, 2024
05:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

శాంసంగ్ ప్రతేడాది చైనాలో విడుదల చేసే W-సిరీస్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ప్రత్యేక డిజైన్, అదనపు ఫీచర్లు, మెరుగైన ర్యామ్ స్టోరేజ్‌తో వినియోగదారులకు ఈ స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉంటాయి. ఈ ఫోన్‌లు గ్లోబల్ Z-సిరీస్ ఆధారంగా రూపొందిచారు. తాజాగా, శాంసంగ్ చైనా వెబ్‌సైట్‌లో W25 ఫ్లిప్ (Galaxy Z Flip 6 ఆధారంగా) W25 (Galaxy Z ఫోల్డ్ స్పెషల్ ఎడిషన్ ఆధారంగా) ఫోన్‌లను అధికారికంగా ప్రకటించింది. ఈ రెండు మోడళ్లకు ప్రత్యేకమైన 'హార్ట్ టు ది వరల్డ్' లోగోతో కూడిన సిరామిక్ బ్లాక్ బ్యాక్ ప్యానెల్, గోల్డ్ అల్యూమినియం ఫ్రేమ్‌ను కలిగి ఉంటాయి.

Details

Samsung W25 ఫ్లిప్‌ ఫీచర్లు ఇవే

Samsung W25 ఫ్లిప్‌లో 6.7 అంగుళాల ప్రధాన డిస్‌ప్లే, 3.4 అంగుళాల కలర్ డిస్‌ప్లేతో రానుంది. వినియోగదారులకు ప్రత్యేకమైన డైనమిక్ వాల్‌పేపర్‌లతో గానీ, 'క్లౌడ్ ఫ్యాన్ ఎలిగాన్స్' డిజైన్‌తో గానీ ఆకట్టుకుంటుంది. 50-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 2x ఆప్టికల్ జూమ్, అధునాతన AI ఆటో ఫోకస్ వంటి ఫీచర్లను కలిగి ఉండి, ఫోటోగ్రఫీలో ఉన్నత అనుభవాన్ని అందిస్తుంది. ఈ ఫోన్‌లో చాట్ అసిస్టెంట్, రియల్ టైమ్ ట్రాన్స్‌లేషన్, ట్రాన్స్‌క్రిప్షన్, Bixi వంటి మరిన్ని AI ఆధారిత ఫీచర్లు ఉన్నాయి.

Details

 Samsung W25లో ఫీచర్లు

Samsung W25లో బుక్-స్టైల్ ఫోల్డబుల్ డిజైన్‌తో 8 అంగుళాల మెయిన్ స్క్రీన్, 6.5 అంగుళాల కలర్ స్క్రీన్‌ను కలిగి ఉంది. మల్టీ టాస్కింగ్ కోసం అనుకూలంగా ఉండే ఈ ఫోన్, తెరిచినప్పుడు టాబ్లెట్ లాంటి అనుభవాన్ని ఇస్తుంది. 255 గ్రాముల బరువు కలిగి ఉండే ఈ ఫోన్ సిరామిక్ బ్లాక్, గోల్డ్ డిజైన్‌లో అందుబాటులో ఉంది. దీనిలో ప్రత్యేకమైన లక్షణంగా ఉన్న 200 మెగాపిక్సెల్ అల్ట్రా-హై రిజల్యూషన్ కెమెరా అత్యుత్తమ చిత్రాలను అందిస్తుంది. ఈ రెండు ఫోన్‌లలో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్ 3nm ప్రాసెసర్‌తో పని చేస్తుంది. వేగవంతమైన ప్రతిస్పందన సమయాలు, మెరుగైన కనెక్టివిటీతో ఈ ఫోన్లు వినియోగదారుల కోసం ముందస్తు రిజిస్ట్రేషన్ కోసం శాంసంగ్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.