LOADING...
Uber : ఉబర్ సహవ్యవస్థాపకుడు కొత్త స్టార్ట్‌అప్‌.. 'Atoms' రోబోటిక్స్ కంపెనీ ప్రారంభం
ఉబర్ సహవ్యవస్థాపకుడు కొత్త స్టార్ట్‌అప్‌.. 'Atoms' రోబోటిక్స్ కంపెనీ ప్రారంభం

Uber : ఉబర్ సహవ్యవస్థాపకుడు కొత్త స్టార్ట్‌అప్‌.. 'Atoms' రోబోటిక్స్ కంపెనీ ప్రారంభం

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 14, 2026
12:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

క్యాబ్‌ సర్వీస్‌ సంస్థ ఉబర్ సహవ్యవస్థాపకుడు, మాజీ సీఈఓ ట్రావిస్ కలానిక్ మరో కొత్త స్టార్ట్‌అప్‌ను ప్రారంభించారు. 'Atoms' అనే పేరుతో ప్రారంభించిన ఈ సంస్థ పారిశ్రామిక రంగాల్లో ప్రత్యేక పనులను ఆటోమేట్‌ చేసే రోబోటిక్స్‌ సాంకేతికతపై దృష్టి సారించనుంది. ముఖ్యంగా గనులు, రవాణా, ఆహార పరిశ్రమల్లో ఉపయోగించే ప్రత్యేక రోబోట్‌ వ్యవస్థలను అభివృద్ధి చేయడం ఈ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.

Details

పాత స్టార్ట్‌అప్‌కు విస్తరణ

'Atoms' అనేది క‌లానిక్‌ గతంలో ప్రారంభించిన సిటీ స్టోరేజ్ సిస్టమ్స్ అనే సంస్థకు విస్తరణగా, కొత్త బ్రాండ్‌గా రూపుదిద్దుకుంది. 2017లో ఉబర్‌ సీఈఓ పదవి నుంచి తప్పుకున్న తర్వాత ఆయన ఈ సంస్థపై పని చేయడం ప్రారంభించారు. "పనికి తగిన విధంగా రూపొందించిన ప్రత్యేక యంత్రాలే పరిశ్రమల్లో ఉత్పాదకతను పెంచగలవని క‌లానిక్‌ పేర్కొన్నారు. ఒక పని కోసం రూపొందించిన యంత్రం అదే పనిలో అత్యుత్తమ ఫలితాలు ఇస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

Details

మూడు కీలక రంగాలపై దృష్టి

'Atoms' సంస్థ ప్రధానంగా మూడు రంగాలపై దృష్టి పెట్టనుంది. Atoms Food ద్వారా ఆహార పరిశ్రమకు అవసరమైన మౌలిక సదుపాయాలు అందించడం Atoms Mining ద్వారా గనుల రంగంలో ఉత్పాదకత పెంచే రోబోటిక్‌ సాంకేతికతలు అభివృద్ధి చేయడం Atoms Transport ద్వారా రోబోట్ల కోసం ప్రత్యేక 'వీల్‌బేస్‌' వ్యవస్థను రూపొందించడం ఈ విధంగా ఫిజికల్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) ఆధారంగా వాస్తవ ప్రపంచ పనులను ఆటోమేట్‌ చేసే ప్రత్యేక వ్యవస్థలను రూపొందించాలనే లక్ష్యంతో ఈ వ్యూహాన్ని రూపొందించారు.

Advertisement

Details

ఆటోనమస్‌ వాహన స్టార్ట్‌అప్‌ కొనుగోలు ప్రయత్నం

'Atoms Mining' విభాగాన్ని బలోపేతం చేసేందుకు క‌లానిక్‌ ఒక కీలక నిర్ణయం తీసుకుంటున్నారు. గనులు, పారిశ్రామిక ప్రాంతాల్లో ఉపయోగించే ఆటోనమస్‌ వాహనాలపై పనిచేస్తున్న Pronto అనే స్టార్ట్‌అప్‌ను కొనుగోలు చేసే దిశగా ఆయన ముందుకెళ్తున్నారు. ఈ సంస్థను ఆయన మాజీ ఉబర్‌ సహచరుడు ఆంథోనీ లెవాండోస్కీ స్థాపించారు. ఇప్పటికే ప్రొంటోలో తానే అతిపెద్ద పెట్టుబడిదారుడినని క‌లానిక్‌ వెల్లడించారు.

Advertisement

Details

గతంలో వివాదాలకు దారి తీసిన ప్రాజెక్ట్

2015లో ఉబర్‌లో క‌లానిక్‌ స్వయంచాలక వాహనాల విభాగాన్ని ప్రారంభించారు. అయితే ఈ ప్రాజెక్ట్‌ వివాదాలకు దారి తీసింది. ఆ సమయంలో గూగుల్‌ తమ స్వయంచాలక కార్ల ప్రాజెక్ట్‌కు సంబంధించిన సాంకేతిక రహస్యాలను ఉబర్‌ దోచుకుందని ఆరోపిస్తూ కేసు వేసింది. ఆ ప్రాజెక్ట్‌ తరువాత వేమోగా అభివృద్ధి చెందింది. ఈ కేసులో కీలక పాత్ర పోషించిన లెవండోవ్‌స్కీపై క్రిమినల్‌ కేసు నమోదై, చివరకు ఆయనకు 18 నెలల జైలు శిక్ష కూడా విధించబడింది. తరువాత కంపెనీల మధ్య వివాదం సర్దుబాటు అయినప్పటికీ ఈ సంఘటన అప్పట్లో టెక్‌ రంగంలో పెద్ద చర్చకు దారి తీసింది. ఇప్పుడేమో పరిశ్రమల్లో ఉత్పాదకతను పెంచే లక్ష్యంతో ప్రత్యేక రోబోటిక్స్‌ వ్యవస్థలను అభివృద్ధి చేయాలని క‌లానిక్‌'Atoms'ద్వారా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు.

Advertisement