LOADING...
Nuclear Missile: న్యూక్లియర్ బేస్‌పై వింత లైట్లు.. మిస్సైళ్లు ఆఫ్ చేసిన 'అలియన్ శక్తి'?
న్యూక్లియర్ బేస్‌పై వింత లైట్లు.. మిస్సైళ్లు ఆఫ్ చేసిన 'అలియన్ శక్తి'?

Nuclear Missile: న్యూక్లియర్ బేస్‌పై వింత లైట్లు.. మిస్సైళ్లు ఆఫ్ చేసిన 'అలియన్ శక్తి'?

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 17, 2026
03:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

దాదాపు 60సంవత్సరాల క్రితం అమెరికాలో జరిగిన ఓ ఘటనపై మాజీ యూఎస్ ఎయిర్ ఫోర్స్ మిస్సైల్ లాంచ్ అధికారి రాబర్ట్ సాలస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలియని ఓ శక్తి అమెరికా అణు మిస్సైళ్లను ఒక్కసారిగా పనిచేయకుండా చేసి,మూడో ప్రపంచ యుద్ధాన్ని అడ్డుకుందని ఆయన పేర్కొన్నారు. ఓ పోడ్‌కాస్ట్‌లో మాట్లాడిన సాలస్..ఆ సమయంలో బేస్ చుట్టూ వింత లైట్లు తిరుగుతూ కనిపించాయని, అవి పంపిన సిగ్నల్ మిస్సైళ్లను పూర్తిగా నిలిపివేసిందని చెప్పారు. ఈ ఘటన 1967లో కోల్డ్ వార్ ఉధృతంగా ఉన్న సమయంలో మాంటానాలోని మాల్మ్‌స్ట్రోమ్ ఎయిర్ ఫోర్స్ బేస్‌లో జరిగినట్లు తెలిపారు. అక్కడ ఉన్న 20మినిట్‌మాన్-I ఇంటర్‌కాంటినెంటల్ బాలిస్టిక్ మిస్సైళ్లు ఒక్కసారిగా గ్రీన్ నుంచి రెడ్‌కు మారి పనిచేయడం ఆపేశాయని చెప్పారు.

వివరాలు 

భూగర్భంలో దాచిన మిస్సైళ్లకు చుట్టూ జామర్లు

బేస్ పై తేలియాడుతున్న వేగంగా కదిలే కాంతి ఎర్రటి కాంతిని విడుదల చేసిన తర్వాతే ఈ మార్పు జరిగిందని వివరించారు. ఆ లైట్లు సోవియట్ యంత్రాలకు చెందినవని ఎవరూ నమ్మలేదని ఆయన పేర్కొన్నారు. భూగర్భంలో దాచిన మిస్సైళ్లకు చుట్టూ జామర్లు ఉన్నప్పటికీ, ఆ వింత సిగ్నల్ వాటిని దాటుకుని మిస్సైళ్లను చేరిందని సాలస్ చెప్పారు. ఇది "మానవేతర తెలివైన నాగరికతల" పని అని తాను నమ్ముతున్నానని, వారు భూమిని అణు యుద్ధం నుంచి కాపాడేందుకు వచ్చారని ఆయన అభిప్రాయపడ్డారు.

వివరాలు 

10 ఐసీబీఎంలు ఒక్కసారిగా ఆఫ్.. గార్డులు చూసిన వింత కాంతులు

"మనుషులకి తెలియని మరో నాగరికత మనల్ని గమనిస్తోంది. అణు యుద్ధంతో ఈ గ్రహాన్ని మనమే నాశనం చేసుకోకుండా చూసే ప్రయత్నం చేస్తోంది" అని సాలస్ తెలిపారు. ఈ సంఘటన మొదట 1967 మార్చి 16న జరిగింది. ఎలాంటి హెచ్చరిక లేకుండా 10ఐసీబీఎంలు పనిచేయడం ఆపేశాయని చెప్పారు. మార్చి 24న రాత్రి 10 గంటల సమయంలో సెక్యూరిటీ గార్డు నుంచి కాల్ వచ్చిందని,న్యూక్లియర్ బేస్ పై అనేక వింత లైట్లు కనిపిస్తున్నాయని చెప్పాడని తెలిపారు. ఆ లైట్లు 90డిగ్రీల కోణాల్లో తిరుగుతున్నాయని గార్డులు పేర్కొన్నారు. మొదట సాలస్ వాటిని పెద్దగా పట్టించుకోలేదు. అయితే కొద్దిసేపటికి మరో కాల్ వచ్చిందని, బేస్ గేట్ వద్ద తేలియాడుతున్న ఓ యూఎఫ్ఓ నుంచి ఎర్రటి కాంతి వెలువడుతోందని తెలిపారు.

Advertisement

వివరాలు 

మాల్మ్‌స్ట్రోమ్ బేస్‌లో ఉన్న వారందరికీ గోప్యత ఒప్పందాలు

తర్వాత రెండు మిస్సైల్ సిలోలపై కూడా ఇలాంటి లైట్లు కనిపించాయని, వెంటనే అలారం మోగిందని చెప్పారు. అది మిస్సైళ్లలో ఏదో సమస్య ఏర్పడిందని సూచించిందని వివరించారు. "కంట్రోల్ బోర్డు చూస్తే మిస్సైళ్లు గ్రీన్ నుంచి రెడ్‌కి మారిపోయాయి. ఇక లాంచ్ చేయడం అసాధ్యం అయింది" అని సాలస్ తెలిపారు. అదే సమయంలో మిస్సైల్ ప్రాంతంలో చొరబాటు జరిగినట్లు సూచించే అలర్ట్ లైట్లు కూడా వెలిగాయని చెప్పారు. ఆ వింత వస్తువులు ఒక్కసారిగా కనిపించకుండా పోయాయని, అనంతరం ఎయిర్ ఫోర్స్ ఆఫీస్ ఆఫ్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్స్ (AFOSI) అధికారులు వచ్చి అందరితో గోప్యత ఒప్పందాలపై సంతకాలు చేయించారని తెలిపారు. ఈ ఘటన గురించి బయటకు చెప్పకూడదని కఠిన ఆదేశాలు ఇచ్చారని చెప్పారు.

Advertisement

వివరాలు 

మాల్మ్‌స్ట్రోమ్ బేస్‌లో ఉన్న వారందరికీ గోప్యత ఒప్పందాలు

ఈ ఘటనపై ఏరోస్పేస్ కంపెనీ బోయింగ్ దర్యాప్తు చేసినప్పటికీ స్పష్టమైన కారణం కనుగొనలేకపోయింది. చివరికి బాహ్య ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ సిగ్నల్ కారణంగా మిస్సైళ్ల గైడెన్స్, కంట్రోల్ సిస్టమ్స్ పనిచేయకుండా పోయాయని నిర్ధారించిందని తెలిపారు. తాను ఇటీవల ఒక యూఎఫ్ఓ పుస్తకంలో ఇలాంటి సంఘటన గురించి చదివిన తర్వాతే ఈ విషయాన్ని బయటపెట్టాలని నిర్ణయించుకున్నానని సాలస్ వెల్లడించారు.

Advertisement