Page Loader
Vivo X Fold 5: 6000mAh బ్యాటరీతో వివో ఎక్స్ ఫోల్డ్ 5 రాబోతోంది!
6000mAh బ్యాటరీతో వివో ఎక్స్ ఫోల్డ్ 5 రాబోతోంది!

Vivo X Fold 5: 6000mAh బ్యాటరీతో వివో ఎక్స్ ఫోల్డ్ 5 రాబోతోంది!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 22, 2025
03:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

వివో ఎక్స్ ఫోల్డ్ 5 త్వరలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను చైనాలో తొలిసారిగా కంపెనీ ఆవిష్కరించనుంది. రాబోయే ఫోల్డబుల్ ఫోన్ Vivo X Fold 5 జూలైలో భారత్‌లో కూడా విడుదల కానుందని నివేదికలు సూచిస్తున్నాయి. ఈ హ్యాండ్‌సెట్‌ 6000mAh బ్యాటరీ, వైర్డు, వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో రానుంది. Vivo X Fold 5 లో 8T LTPO డిస్‌ప్లే ఇవ్వనున్నారు. ఈ ఫోన్ Zeiss మద్దతుతో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో రానుంది. Vivo X Fold 5 భారత్‌లో జూలై 10 నుండి జూలై 15 మధ్య లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

Details

జూన్ 25న మార్కెట్ లోకి

చైనాలో మాత్రం జూన్ 25న ఈ ఫోన్ మార్కెట్‌లోకి రానుంది. Honor కూడా తన ఫోల్డబుల్ ఫోన్‌ను జూలై 2న చైనా మార్కెట్లోకి తీసుకురానుంది. వివో X Fold 5 గురించి ఇప్పటికే అనేక టీజర్లు విడుదలయ్యాయి. ఈ ఫోన్‌లో 6000mAhబ్యాటరీ, 80Wవైర్డ్ ఛార్జింగ్‌తో పాటు 40W వైర్‌లెస్ ఛార్జింగ్‌ కూడా అందుబాటులో ఉంటుంది. రివర్స్ ఛార్జింగ్ ఫీచర్ కూడా ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఉంటుంది. Zeiss ట్యూన్ చేసిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో రానున్న ఈ ఫోన్‌ 3X ఆప్టికల్ జూమ్ ఉన్న పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్ 8T LTPO డిస్‌ప్లేతో రానుంది. Vivo X Fold 5అధికారిక ఫోటోలను ఇప్పటికే ఆన్‌లైన్‌లో పోస్ట్ చేశారు.