LOADING...
Google Map: ఇంధన ఖర్చు తగ్గించాలా? గూగుల్ మ్యాప్స్‌లో ఈ సెట్టింగ్‌ను ఎనేబుల్ చేయండి!
ఇంధన ఖర్చు తగ్గించాలా? గూగుల్ మ్యాప్స్‌లో ఈ సెట్టింగ్‌ను ఎనేబుల్ చేయండి!

Google Map: ఇంధన ఖర్చు తగ్గించాలా? గూగుల్ మ్యాప్స్‌లో ఈ సెట్టింగ్‌ను ఎనేబుల్ చేయండి!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 05, 2025
01:37 pm

ఈ వార్తాకథనం ఏంటి

గూగుల్ మ్యాప్స్‌లో అందుబాటులో ఉన్న ఫ్యూయెల్ ఎఫీషియెంట్ రూట్ ఫీచర్ ద్వారా మీరు తక్కువ ఇంధనంతో గమ్యస్థానం చేరవచ్చు. ఈ ఫీచర్ మీరు కారు లేదా బైక్ ఉపయోగిస్తున్నారో అనుసరిస్తూ, సరైన రూట్ సూచిస్తుంది. ప్రతి రూట్ ద్వారా ఎంత ఇంధనం ఖర్చవుతుందో అంచనా కూడా చూపిస్తుంది, తద్వారా మీరు మీకు నచ్చిన రూట్‌ను ఎంచుకోవచ్చు.

Details

ఎలా ఎనేబుల్ చేయాలి 

1. గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి ప్రొఫైల్ ఐకాన్‌పై క్లిక్ చేసి 'సెట్టింగ్స్' లోకి వెళ్లాలి. 2. అక్కడ 'నేవిగేషన్'పై క్లిక్ చేస్తే 'రూట్ ఆప్షన్స్' కనిపిస్తాయి. 3. రూట్ ఆప్షన్స్‌లో 'ఫ్యూయెల్ ఎఫీషియెంట్ రూట్' ఆప్షన్‌ను ఎనేబుల్ చేయాలి. 4. తర్వాత 'ఇంజిన్ టైప్' సెక్షన్‌లో మీ వాహన ఇంజిన్ రకాన్ని ఎంటర్ చేయాలి. డిఫాల్ట్‌గా పెట్రోల్ ఇంజిన్ సెట్ అవుతుంది. డీజిల్, సీన్‌జీ/హైబ్రిడ్ వాహనాల కోసం ఇంజిన్ టైప్‌ను మార్చాలి. 5. ఇలా సెట్ చేసిన తర్వాత, ఇంజిన్ రకాన్ని బట్టి రూట్ సజెషన్స్ పొందవచ్చు.

Details

ప్రయోజనం

ఇంధన ఖర్చు తగ్గుతుంది ప్రయాణ సమయం తగ్గే అవకాశం ఉంటుంది ఈ ఫీచర్ సెట్ చేసినప్పుడు సాధ్యమైన తక్కువ దూరం కలిగిన రూట్ చూపిస్తుంది. కానీ ఆ రూట్‌లో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటే, ఫీచర్‌ను ఆఫ్ చేసి వేరే రూట్ ఎంచుకోవడం మంచిది.