Grok: గ్రోక్ ఏఐలో మీ డేటా, ఫొటోల వినియోగాన్ని ఆపాలా? ఇలా చేయండి!
ఈ వార్తాకథనం ఏంటి
ఎలాన్ మస్క్‌కు చెందిన గ్రోక్ (Grok) ఏఐ చాట్‌బాట్ మరోసారి వివాదాల కేంద్రంగా మారింది. మహిళలు, మైనర్లకు సంబంధించిన సున్నిత చిత్రాలను ఏఐ రూపొందిస్తోందన్న ఆరోపణలతో గోప్యత, డేటా వినియోగంపై తీవ్ర చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో వినియోగదారులకు తమ X (మాజీ ట్విట్టర్) ఖాతా డేటా గోక్ ద్వారా ఎలా వినియోగించబడాలో నియంత్రించే వెసులుబాటు అందుబాటులో ఉంది. గోక్ ద్వారా వ్యక్తిగతీకరించిన (Personalised) సమాధానాలు కావాలనుకోని వారు, లేదా తమ X ఖాతా కార్యకలాపాలు సమాధానాలపై ప్రభావం చూపకూడదని భావించే వినియోగదారులు, ఈ సెట్టింగ్‌లను మార్చుకునే అవకాశం ఉంది.
Details
డిఫాల్ట్‌గా గోక్ ఏ డేటాను ఉపయోగిస్తుంది?
సాధారణంగా గోక్ ఏఐ, వినియోగదారుల X ఖాతాతో అనుసంధానమైన డేటాను ఉపయోగించి సమాధానాలను వ్యక్తిగతీకరిస్తుంది. ఇందులో X ప్రొఫైల్ వివరాలు ఖాతా సెట్టింగ్‌లు, అభిరుచులు పబ్లిక్‌గా కనిపించే పోస్టులు, కార్యకలాపాలు వంటి సమాచారం ఉంటుంది. ఈ విధానం ద్వారా వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా సమాధానాలు ఇవ్వాలన్నదే గోక్ లక్ష్యం. అయితే గోప్యత లేదా తటస్థ (న్యూట్రల్) సమాధానాలు కోరుకునే వారికి ఇది ఇబ్బందిగా మారే అవకాశం ఉంది.
Details
X ఆధారిత వ్యక్తిగతీకరణను ఎలా ఆపాలి?
వినియోగదారులు గోక్‌లోని సెట్టింగ్‌ల ద్వారా X డేటా ఆధారిత వ్యక్తిగతీకరణను నిలిపివేయవచ్చు. దీనివల్ల గోక్ మీ X ప్రొఫైల్ సమాచారం కార్యకలాపాలు పోస్టుల ఆధారంగా సమాధానాలు ఇవ్వడం పరిమితం అవుతుంది. ఈ సెట్టింగ్‌ను ఆఫ్ చేసిన తర్వాత, గోక్ సమాధానాలు మరింత సాధారణంగా, తటస్థంగా ఉండే అవకాశం ఉంటుంది. గోప్యతే కీలకం గోక్ ఏఐపై కొనసాగుతున్న వివాదాల నేపథ్యంలో డేటా నియంత్రణ వినియోగదారుల చేతుల్లో ఉండటం కీలకమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అవసరాన్ని బట్టి వ్యక్తిగతీకరణను ఉపయోగించుకోవచ్చు లేదా పూర్తిగా నిలిపివేయవచ్చని గోక్ అందిస్తున్న ఈ ఎంపికలు, గోప్యతపై శ్రద్ధ వహించే వారికి ఉపయోగకరంగా మారనున్నాయి.