LOADING...
Your Name in Landsat: భూమిపై మీ పేరు కనిపించాలా? నాసా ప్రత్యేక టూల్‌తో సాధ్యం!
భూమిపై మీ పేరు కనిపించాలా? నాసా ప్రత్యేక టూల్‌తో సాధ్యం!

Your Name in Landsat: భూమిపై మీ పేరు కనిపించాలా? నాసా ప్రత్యేక టూల్‌తో సాధ్యం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 28, 2026
10:55 am

ఈ వార్తాకథనం ఏంటి

భూమి, అంతరిక్ష శాస్త్రాలపై ప్రజల్లో ఆసక్తి పెంచే లక్ష్యంతో అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. 'లాండ్‌శాట్‌లో మీ పేరు' పేరుతో తీసుకొచ్చిన ఈ వినూత్న టూల్ ద్వారా, భూమిపై సహజ భౌగోళిక ఆకృతుల్లోనే మన పేరు దాగి ఉన్నట్లుగా శాటిలైట్ చిత్రాల రూపంలో చూడొచ్చు. ఈ కార్యక్రమం ల్యాండ్‌శాట్ ప్రోగ్రామ్‌లో భాగంగా రూపొందించారు. భూగర్భ శాస్త్రం, అంతరిక్ష పరిశోధనలపై ఆసక్తిని పెంచడమే దీని ముఖ్య ఉద్దేశ్యం. ఈ టూల్ సాయంతో వినియోగదారులు తమ పేరు లేదా తమకు ప్రియమైన వారి పేరును, భూమిపై సహజంగా ఏర్పడిన భౌగోళిక ఆకృతుల్లో కనిపించే అక్షరాల రూపంలో గుర్తించవచ్చు. దీని ద్వారా భూమి సహజ వైవిధ్యాన్ని కొత్త కోణంలో అనుభవించే అవకాశం లభిస్తుంది.

వివరాలు

మీ పేరు ఎలా కనిపెట్టాలి?

'Your Name in Landsat' టూల్‌ను ఉపయోగించడం చాలా సులభం. ముందుగా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. అక్కడ ఇచ్చిన బాక్స్‌లో A నుంచి Z వరకు అక్షరాలతో మీ పేరు టైప్ చేయాలి. వెంటనే ఆ టూల్ శాటిలైట్ చిత్రాల్లో ఆ అక్షరాలకు సరిపడే భూభాగ ఆకృతులను వెతికి చూపిస్తుంది. చివరగా, మొత్తం పేరును ఒక గ్రాఫిక్ రూపంలో చూపిస్తూ, ప్రతి అక్షరానికి సంబంధించిన ఖచ్చితమైన కోఆర్డినేట్స్‌ను కూడా అందిస్తుంది. అవసరమైతే ఆ చిత్రాన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు లేదా ఇతరులతో పంచుకోవచ్చు.

వివరాలు

ప్రత్యేక గ్యాలరీ కూడా

ఈ టూల్‌లో భాగంగా 'Alphabet Image Gallery'ను కూడా అందుబాటులో ఉంచారు. ఇందులో అక్షరాలకు అనుగుణంగా 72 రకాల శాటిలైట్ చిత్రాలను వీక్షించే అవకాశం ఉంది. Earth Day 2026లో భాగం 'Your Name in Landsat' కార్యక్రమం Earth Day 2026 సందర్భంగా నాసా చేపట్టిన పలు వినూత్న కార్యక్రమాల్లో ఒకటి. భూమి భౌగోళిక విశేషాలపై ప్రజల్లో అవగాహన పెంచడం, పర్యావరణ సమస్యలపై చైతన్యం కల్పించడం దీని ప్రధాన లక్ష్యం.

Advertisement