Page Loader
Water From Air: గాలిలోని తేమ నుంచి మంచినీటిని తయారుచేసే టెక్నాలజీ.. అమెరికా ఎంఐటీ శాస్త్రవేత్తల సరికొత్త ఆవిష్కరణ
అమెరికా ఎంఐటీ శాస్త్రవేత్తల సరికొత్త ఆవిష్కరణ

Water From Air: గాలిలోని తేమ నుంచి మంచినీటిని తయారుచేసే టెక్నాలజీ.. అమెరికా ఎంఐటీ శాస్త్రవేత్తల సరికొత్త ఆవిష్కరణ

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 07, 2025
12:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇకపై తాగునీటి కోసం భూమిని తవ్వాల్సిన అవసరం లేకుండానే, గాలినుంచి స్వచ్ఛమైన నీటిని సులభంగా పొందే అవకాశం అందుబాటులోకి రానుంది. అమెరికాలోని ప్రముఖ శాస్త్రీయ విద్యాసంస్థ మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ)కు చెందిన పరిశోధకులు ఈ వినూత్న ఆవిష్కరణను అభివృద్ధి చేశారు. విద్యుత్ వినియోగం లేకుండానే గాలిలో ఉన్న తేమను అందించి నీటిగా మార్చే ప్రత్యేకమైన విండో ప్యానెల్‌ను రూపొందించారు. ఈ ప్రత్యేక పరికరం ద్వారా ప్రతిరోజూ సుమారు 5 నుండి 6 లీటర్ల వరకు తాగునీటిని ఉత్పత్తి చేయవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నీటి అందుబాటు లేని కరువు ప్రాంతాల్లో ఇది గొప్ప పరిష్కారంగా నిలవనుందని నిపుణుల అభిప్రాయం.

vivaralu

విద్యుత్ లేకుండా పనిచేసే విధానం వల్ల ఖర్చు తక్కువ

ముఖ్యంగా ఎడారులు, నీటి వనరులు లేనివాటిలో తాగునీటి సమస్యను అధిగమించేందుకు ఈ సాంకేతికత ఎంతో ఉపయోగపడనుందని వారు పేర్కొన్నారు. ఈ ప్యానెల్ పని చేసే విధానం కూడా తేలికైనదే. దీనిలో హైగ్రోస్కోపిక్ లవణాలు, గ్లిసరాల్‌తో తయారైన ప్రత్యేక హైడ్రోజెల్ పొర వుంటుంది. ఇది రాత్రివేళ గాలిలోని తేమను ఆస్వాదిస్తుంది. ఉదయం సూర్యకాంతి పడగానే, హైడ్రోజెల్‌లో చేరిన తేమ వేడి ద్వారా ఆవిరైపోయి, చల్లబడి నీటి బిందువులుగా మారుతుంది. ఇది పూర్తిగా స్వచ్ఛమైన తాగునీటిగా మారుతుందని శాస్త్రవేత్తలు వివరించారు. విద్యుత్ లేకుండా పనిచేసే ఈ విధానం వల్ల ఖర్చు కూడా చాలా తక్కువగా ఉంటుందని వారు వెల్లడించారు.