Azure outage: ఆజ్యూర్ అవుటేజ్ కారణాన్ని వెల్లడించిన మైక్రోసాఫ్ట్
ఈ వార్తాకథనం ఏంటి
మైక్రోసాఫ్ట్ ఆజ్యూర్ క్లౌడ్ ప్లాట్‌ఫాం, దానితో పాటు 365 సర్వీసులు, ఎక్స్‌బాక్స్, మైన్‌క్రాఫ్ట్ వంటి ప్రముఖ సేవలు బుధవారం పెద్ద స్థాయి అంతరాయం ఎదుర్కొన్నాయి. ఈ ఆటంకం "అనుకోకుండా జరిగిన కాన్ఫిగరేషన్ మార్పు" వల్ల చోటు చేసుకుందని మైక్రోసాఫ్ట్ స్పష్టం చేసింది. రెండువారాల వ్యవధిలో ఇదే రెండోసారి పెద్ద క్లౌడ్ సేవాప్రదాత ఇలాంటి సమస్యను ఎదుర్కోవడం, కొద్ది టెక్ దిగ్గజాల ఆధీనంలో ఉన్న ఇంటర్నెట్ మౌలిక సదుపాయాల బలహీనతను మరోసారి బయటపెట్టింది.
సేవ ప్రభావం
ఆజ్యూర్ 'ఫ్రంట్‌డోర్' సర్వీస్ కారణమని గుర్తింపు
మైక్రోసాఫ్ట్ సేవల్లో ఏర్పడిన సమస్యలు ఆజ్యూర్ ఫ్రంట్‌డోర్ కంటెంట్ డెలివరీ నెట్‌వర్క్‌కు సంబంధించినవని గుర్తించారు. ఈ అవుటేజ్ మైక్రోసాఫ్ట్ ఆర్థిక ఫలితాల ప్రకటనకు గంటల ముందు రావడం విశేషం. దీని ప్రభావంతో కంపెనీ వెబ్‌సైట్, ఇన్వెస్టర్ రిలేషన్స్ పేజీలు అందుబాటులో లేకపోయాయి. సాధారణంగా సేవల స్థితి వివరాలను అప్‌డేట్ చేసే ఆజ్యూర్ స్టేటస్ పేజీ కూడా ఈ సమయంలో మధ్య మధ్యలో పనిచేయకుండా ఉండిపోయింది.
రికవరీ ప్రయత్నాలు
సేవలను పునరుద్ధరించేందుకు పాత వెర్షన్‌కి రివర్ట్
ఈ అవుటేజ్‌కు స్పందిస్తూ మైక్రోసాఫ్ట్ తన సిస్టమ్‌లోని తాజా మార్పులను దశలవారీగా వెనక్కి తీసుకోవడం ప్రారంభించింది. దీని ఉద్దేశ్యం.. సేవలు సవ్యంగా పనిచేసిన "చివరి స్థిరమైన వెర్షన్"ని గుర్తించడం. చివరికి మైక్రోసాఫ్ట్ ఆ స్థిరమైన వెర్షన్‌ని విజయవంతంగా అమలు చేసినట్లు ప్రకటించింది. "వినియోగదారులు సేవలు మెల్లగా తిరిగి అందుబాటులోకి వస్తున్న సంకేతాలు గమనించవచ్చు" అని సంస్థ తెలిపింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఇప్పుడు తగ్గిన సమస్య
🛠 Engineers have confirmed that an issue which impacted a subset of Azure services is now mitigated. A detailed resolution statement has been posted to the Azure Status History page here: Azure status history | Microsoft Azure
— Azure Support (@AzureSupport) October 30, 2025
క్లౌడ్ వైఫల్యాలు
AWS అవుటేజ్ తరువాత మళ్లీ ఆటంకం
ఈ ఆజ్యూర్ అవుటేజ్ టైమింగ్ కూడా గమనించదగ్గది. ఎందుకంటే ఇది అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS)లో జరిగిన పెద్ద అవుటేజ్ తరువాత కేవలం తొమ్మిది రోజులకే చోటు చేసుకుంది. ఆ సంఘటన ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక వెబ్‌సైట్లు, యాప్‌లను ప్రభావితం చేసింది. అందులో స్నాప్‌చాట్, రెడిట్ వంటి ప్రసిద్ధ యాప్‌లు కూడా ఉన్నాయి. ఈ భారీ క్లౌడ్ సర్వీసులు వినియోగదారులకు భద్రతా ప్రమాణాలను మెరుగుపరుస్తున్నా, ఇలాంటి అవుటేజ్‌ల సమయంలో అవే ప్రధాన డిజిటల్ సర్వీసులకు "సింగిల్ పాయింట్ ఆఫ్ ఫెయిల్యూర్"గా మారుతాయి.
రంగం ప్రభావం
ఎయిర్‌లైన్స్,ఎయిర్‌పోర్ట్స్ సైతం ప్రభావితమయ్యాయి
ఈ అవుటేజ్ ప్రభావం పలు రంగాలపై పడింది. అలాస్కా ఎయిర్‌లైన్స్ తమ కీలక వ్యవస్థలు ఆజ్యూర్ సమస్యలతో దెబ్బతిన్నాయని తెలిపింది. బ్రిటన్ హీత్రో విమానాశ్రయ వెబ్‌సైట్ కూడా ఉదయం పనిచేయకపోయినా, ఆ తరువాత పునరుద్ధరించబడింది. వొడాఫోన్ సేవలపైనా ఈ అంతరాయం ప్రభావం చూపింది.