LOADING...
Andhra Pradesh: చిన్న క్లిక్‌ - పెద్ద నష్టం: సైబర్‌ మోసాలపై అప్రమత్తంగా ఉండండి
చిన్న క్లిక్‌ - పెద్ద నష్టం: సైబర్‌ మోసాలపై అప్రమత్తంగా ఉండండి

Andhra Pradesh: చిన్న క్లిక్‌ - పెద్ద నష్టం: సైబర్‌ మోసాలపై అప్రమత్తంగా ఉండండి

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 11, 2025
08:37 am

ఈ వార్తాకథనం ఏంటి

జలుమూరు మండలానికి చెందిన ఒక సచివాలయ సిబ్బందికి రెండు నెలల క్రితం మొబైల్‌ఫోన్‌కు ఓ ఏపీకే ఫైల్‌ వచ్చింది. దానిని తెరిచిన వెంటనే సైబర్‌ మోసగాళ్లు ఆమె ఫోన్‌ను పూర్తిగా హ్యాక్‌ చేసి, ఆమె బ్యాంకు ఖాతా నుంచి రూ.2.12 లక్షలు దోచేశారు. తర్వాత విషయం తెలిసి గందరగోళానికి గురైన ఆమె పోలీసుల సహాయం కోరారు. టెక్కలిలో నివసించే ఓ రిటైర్డ్‌ ఆర్మీ ఉద్యోగి కూడా ఇదే విధంగా మోసపోయాడు. అతడూ ఒక ఏపీకే ఫైల్‌ను ఓపెన్‌ చేయడంతో, మొత్తం రూ.7.18 లక్షలు మాయమయ్యాయి. వెంటనే విషయం ఎవరికీ చెప్పుకోలేదు. మూడు రోజుల తర్వాత సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

వివరాలు 

ఏం చేస్తారంటే.. 

ప్రభుత్వ పథకాలు, రుణాలు, షేర్లు, లాటరీలు... వంటి పేర్లతో వాట్సప్‌, టెలిగ్రామ్‌, ఇతర సోషల్‌ మీడియా గ్రూపుల్లో ఈ ఏపీకే ఫైళ్లు పంపుతుంటారు. ఎవరైనా వాటిని క్లిక్‌ చేస్తే, వారి మొబైల్‌లో ఉన్న వ్యక్తిగత సమాచారం, ఫొటోలు, వీడియోలు, ఇతర డేటా మొత్తం మోసగాళ్ల చేతుల్లో పడిపోతుంది. 'హాయ్ అందరికీ...' సాంకేతికంగా నన్ను ఆండ్రాయిడ్‌ ప్యాకేజీ కిట్‌ ఫైల్‌ అంటారు. ప్రస్తుతం చాలాసార్లు నా పేరు వినిపిస్తోంది. ఎందుకంటే కొంతమంది నేరగాళ్లు నన్నే ఉపయోగించి మీ బ్యాంక్‌ ఖాతాల్లోని డబ్బును క్షణాల్లో దోచేస్తున్నారు. మీ ఓటీపీలు సులభంగా స్వాధీనం చేసుకుని మోసం చేస్తున్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీ ఫోన్‌లో నేను కనబడితే ఏం చేయాలో నేను చెబుతాను... వినండి.

వివరాలు 

ఎలా గుర్తించాలి? 

తెలియని నంబర్ల నుంచి ఫైళ్లు, వీడియో లింకులు వస్తే వెంటనే అప్రమత్తంగా ఉండాలి. పొరపాటున ఏపీకే ఫైల్‌ని ఓపెన్‌ చేస్తే, మీ స్క్రీన్‌పై అది హానికరమని హెచ్చరిక మెసేజ్‌ కనిపిస్తుంది. అప్పుడు వెంటనే దాన్ని మూసేసి జాగ్రత్త పడాలి. ఇవి తప్పక గుర్తుపెట్టుకోండి: ఏదైనా అనుమానం వచ్చినా, డబ్బు నష్టపోయినా వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు కాల్‌ చేయండి. అనుమానాస్పద ఫోన్‌ నంబర్లు లేదా ఈమెయిల్స్‌ వచ్చినప్పుడు www.cybercrime.gov.in వెబ్‌సైట్‌లోని Check Subject విభాగంలో తనిఖీ చేయొచ్చు.

Advertisement