LOADING...
WhatsApp Plus: వాట్సాప్ ప్లస్ ఎలా పొందాలి? ఫీచర్లు, ధర, సబ్‌స్క్రిప్షన్ విధానం
వాట్సాప్ ప్లస్ ఎలా పొందాలి? ఫీచర్లు, ధర, సబ్‌స్క్రిప్షన్ విధానం

WhatsApp Plus: వాట్సాప్ ప్లస్ ఎలా పొందాలి? ఫీచర్లు, ధర, సబ్‌స్క్రిప్షన్ విధానం

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 20, 2026
04:53 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందిన మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఇప్పుడు "వాట్సాప్ ప్లస్" అనే కొత్త ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ సేవను తీసుకురానుంది. ఈ ప్లాన్ పూర్తిగా ఐచ్చికం. అంటే సాధారణ చాట్, వాయిస్, వీడియో కాల్స్ మాత్రం ఇప్పటిలాగే ఉచితంగానే అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం ఈ ఫీచర్‌ను కొంతమంది యూజర్లపై పరీక్షిస్తున్నారు. వాట్సాప్ ప్లస్‌లో ప్రీమియం స్టికర్లు, ప్రత్యేక ఎఫెక్ట్స్, కస్టమ్ థీమ్స్, ఐకాన్లు, ఒకేసారి 20 చాట్స్‌ను పిన్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే కాంటాక్టులకు ప్రత్యేక రింగ్‌టోన్లు పెట్టుకోవడం, చాట్ లిస్ట్‌ను అలర్ట్స్,థీమ్స్‌తో కస్టమైజ్ చేసుకునే సౌకర్యం ఉంటుంది. భవిష్యత్తులో మరిన్ని ఫీచర్లను జోడించే ఆలోచనలో కంపెనీ ఉంది. ఈ సేవ ప్రస్తుతం కొన్ని దేశాల్లో మాత్రమే అందుబాటులో ఉంది.

వివరాలు 

ఒక్క ఖాతాకు ఒక్క సబ్‌స్క్రిప్షన్ మాత్రమే..

సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాలంటే ఆ దేశానికి చెందిన ఫోన్ నంబర్, యాక్టివ్ వాట్సాప్ ఖాతా అవసరం. ధర విషయానికి వస్తే యూరప్‌లో నెలకు సుమారు €2.49 (దాదాపు ₹270)గా ఉండొచ్చని సమాచారం. ఇతర ప్రాంతాల్లో స్థానిక మార్కెట్‌ను బట్టి ధర మారుతుంది. ఈ సబ్‌స్క్రిప్షన్ ప్రతి నెల ఆటోమేటిక్‌గా రెన్యూ అవుతుంది. ప్లాన్ ని తీసుకోవాలంటే ముందుగా వాట్సాప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి "సబ్‌స్క్రిప్షన్స్" ఎంపికను ఓపెన్ చేసి "వాట్సాప్ ప్లస్"పై క్లిక్ చేయాలి. తర్వాత పేమెంట్ వివరాలు చూసి కొనుగోలు పూర్తి చేయాలి. చెల్లింపు Google Play Store ద్వారా జరుగుతుంది. సబ్‌స్క్రిప్షన్ యాక్టివ్ అయిన వెంటనే అన్ని ఫీచర్లు అందుబాటులోకి వస్తాయి. ఒక్క ఖాతాకు ఒక్క సబ్‌స్క్రిప్షన్ మాత్రమే అనుమతిస్తారు.

Advertisement