LOADING...
Google Pixel 10: సిగ్నల్ లేకపోయినా వాట్సాప్ కాల్స్‌.. శాటిలైట్ టెక్నాలజీతో ఎంట్రీ ఇచ్చిన గూగుల్ పిక్సెల్ 10
సిగ్నల్ లేకపోయినా వాట్సాప్ కాల్స్‌.. శాటిలైట్ టెక్నాలజీతో ఎంట్రీ ఇచ్చిన గూగుల్ పిక్సెల్ 10

Google Pixel 10: సిగ్నల్ లేకపోయినా వాట్సాప్ కాల్స్‌.. శాటిలైట్ టెక్నాలజీతో ఎంట్రీ ఇచ్చిన గూగుల్ పిక్సెల్ 10

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 23, 2025
01:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఫోన్‌లో సిగ్నల్‌ లేకుంటే మొబైల్‌ ఉన్నా లేకున్నా పెద్దగా తేడా ఉండదు. ఎందుకంటే సిగ్నల్‌ లేకుండా మనకు బయటి ప్రపంచంతో ఎలాంటి కనెక్షన్‌ ఉండదు. ఇంటర్నెట్‌ ఉపయోగించలేము, కాల్స్‌ కూడా చేయలేము. కానీ ఇకపై ఈ సమస్యకు పరిష్కారం రానుంది. సిగ్నల్స్‌ లేకున్నా కాల్స్‌ చేసుకోవచ్చని ప్రముఖ టెక్‌ దిగ్గజం 'గూగుల్' ప్రకటించింది. గూగుల్‌ పిక్సెల్‌ 10సిరీస్ ఫోన్లలో ఈ వినూత్న టెక్నాలజీని అందుబాటులోకి తీసుకువస్తున్నట్టు వెల్లడించింది. ఈ కొత్త సౌకర్యం ద్వారా సిగ్నల్‌ లేని ప్రాంతాల్లో కూడా వాట్సాప్‌ ద్వారా వాయిస్‌, వీడియో కాల్స్‌ చేసుకోవచ్చు. ఇది శాటిలైట్‌ కమ్యూనికేషన్‌ ఆధారంగా పనిచేస్తుంది. దీంతో పిక్సెల్‌ 10సిరీస్‌ ఈ ప్రత్యేక ఫీచర్‌తో వచ్చే ప్రపంచంలో తొలి ఫోన్‌గా నిలవనుందని గూగుల్‌ చెప్పింది.

Detaisl

'మేడ్ బై గూగుల్' ఈవెంట్‌లో ఆవిష్కరణ 

ఈ నెల 20న జరిగిన 'మేడ్ బై గూగుల్' ఈవెంట్‌లో పిక్సెల్‌ 10 సిరీస్‌ను అధికారికంగా ఆవిష్కరించిన గూగుల్‌, ఆ ఫోన్లలోనే ఈ శాటిలైట్‌ కాలింగ్‌ ఫీచర్‌ను జోడిస్తున్నట్టు తెలిపింది. రాబోయే ఆగస్టు 28 నుంచి గూగుల్‌ పిక్సెల్‌ 10 సిరీస్‌ మార్కెట్లోకి రానుండగా, అదే రోజు నుంచి ఈ సదుపాయాన్ని కూడా యూజర్లకు అందించనుంది.

Details

ఈ ఫీచర్‌ ఎలా పనిచేస్తుంది? 

గూగుల్‌ పిక్సెల్‌ 10 యూజర్‌ సిగ్నల్‌ లేదా వైఫై లేని ప్రాంతంలో ఉన్నప్పుడు, ఫోన్‌ స్టేటస్‌ బార్‌లో శాటిలైట్‌ ఐకాన్‌ కనిపిస్తుంది. ఆ సమయంలో యూజర్‌ వాట్సాప్‌లో వాయిస్‌ లేదా వీడియో కాల్‌ చేసినా, లేదా రిసీవ్‌ చేసినా.. అది శాటిలైట్‌ నెట్‌వర్క్‌ ద్వారా కనెక్ట్‌ అవుతుంది. ఈ ప్రక్రియ సాధారణ కాలింగ్‌ మాదిరిగానే ఉంటుందని గూగుల్‌ రిలీజ్‌ చేసిన టీజర్‌లో వివరించింది.

Details

 ప్రపంచంలోనే తొలి ఫోన్‌గా గుర్తింపు 

ఈ టెక్నాలజీ విజయవంతమైతే, వాట్సాప్‌ ద్వారా శాటిలైట్‌ కాలింగ్‌ను అందించే ప్రపంచంలోనే మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్‌గా గూగుల్‌ పిక్సెల్‌ 10 నిలుస్తుంది. అయితే ఈ సేవలు ఎంపిక చేసిన టెలికం సంస్థల ద్వారా మాత్రమే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అంతేకాక, ఈ ఫీచర్‌ను వినియోగించేందుకు అదనపు చార్జీలు విధించే అవకాశం ఉందని తెలుస్తోంది.