వాట్సాప్ లో మీడియా మెసేజీలను ఎడిట్ చేసే కొత్త ఫీఛర్ వచ్చేసింది
iOS వెర్షన్ ID 23.16.72 ఆపరేటింగ్ సిస్టమ్ ని వాడే స్మార్ట్ ఫోన్ యూజర్లకు వాట్సాప్ లో సరికొత్త ఫీఛర్ వచ్చేసింది. ఇకపై వాట్సాప్ లో టెక్స్ట్ మెసేజ్ పంపిన 15నిమిషాల లోపు మళ్ళీ ఆ మెసేజ్ ని ఎడిట్ చేసుకోవచ్చు. ఈ ఎడిట్ ఆప్షన్ అవతార్ స్టిక్కర్లను ఎడిట్ చేసుకునే సౌకర్యాన్ని కూడా కలిగిస్తుంది. ఈ ఎడిట్ ఆప్షన్ మీకు అందుబాటులో ఉందో లేదో చెక్ చేసుకోవాలంటే మీడియా మెసేజ్ పైన క్లిక్ చేసి అలాగే పట్టుకోవాలి. అయితే ఈ ఫీఛర్ ఇప్పుడప్పుడే అందరికీ అందుబాటులోకి రాలేదు. అందరికీ అందుబాటులోకి రావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది.
త్వరలో మరో కొత్త ఫీఛర్
వాట్సాప్ లో రోజు రోజుకు కొత్త కొత్త అప్డేట్లు వస్తున్నాయి. మెటా గ్రూపుకు చెందిన వాట్సాప్ లో మరికొద్ది రోజుల్లో వాయిస్ చాట్ ఫీఛర్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఈ ఫీఛర్ లో ఎవరైనా గ్రూప్ మెంబర్, వాయిస్ ఛాట్ ని ప్రారంభిస్తాడు. ఆసక్తి గల వారందరూ ఆ వాయిస్ ఛాట్ లో పాల్గొనవచ్చు. ఇది ట్విట్టర్ స్పేస్ ని పోలి ఉంటుందని అనుకోవచ్చు. అలాగే వాట్సాప్ ని మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.