ఫైల్ షేరింగ్ లిమిట్ పెంచడంతో పాటు కొత్త రికార్డింగ్ మోడ్ ఫీచర్స్ అందుబాటులోకి తెచ్చిన వాట్సాప్
వాట్సాప్ ఐఫోన్ కోసం కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. అందుబాటులోకి వచ్చిన ఫీచర్స్ లో వీడియోలను హ్యాండ్స్-ఫ్రీగా రికార్డ్ చేయడానికి కెమెరా మోడ్ తో పాటు, ఒకేసారి 100 వరకు మీడియా ఫైల్స్ ను షేర్ చేయచ్చు. పేరెంట్ సంస్థ మెటా ఫైల్ షేరింగ్ తో పాటు వీడియో రికార్డింగ్‌ను సులభం చేయడానికి ఫీచర్స్ అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఇకపై ఒక్క ట్యాప్‌తో వీడియో మోడ్‌కి మారవచ్చు, వీడియోలను రికార్డ్ చేయడానికి నొక్కి పట్టుకోవాల్సిన అవసరం లేదు. రికార్డింగ్ చేస్తున్నప్పుడు, కెమెరా ముందు నుండి వెనుకకు కూడా మారవచ్చు. ఈ సదుపాయం యాప్ వెర్షన్ 23.3.0.74లో అందుబాటులో ఉంది. ఈ ఫీచర్ 23.3.0.75, 23.3.0.73, 23.3.0.74 అప్డేట్ లో అందుబాటులోకి ఉంటుంది.
ప్రస్తుతం వినియోగదారులు వాట్సాప్ లో 30 ఫైల్‌లను షేర్ చేయవచ్చు
వాటిలో స్టేటస్‌లు, వాయిస్ స్టేటస్‌లు, స్టేటస్ రియాక్షన్‌లు కొత్త అప్‌డేట్‌ల కోసం స్టేటస్ ప్రొఫైల్ రింగ్‌లపై లింక్ ప్రివ్యూలు ఉంటాయి. ఆండ్రయిడ్, డెస్క్‌టాప్ కోసం వాట్సాప్ ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిని ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులు యాక్సెస్ చేయవచ్చు. భారతదేశంలో రైల్వే ప్రయాణీకులు ఇప్పుడు ఎంపిక చేసిన రైళ్లలో వాట్సాప్ ఆన్‌లైన్‌లో ఆహారాన్ని బుక్ చేసుకోవచ్చు. IRCTCలో నమోదు చేయబడిన వాట్సాప్ నంబర్ ద్వారా వాటిని ఆర్డర్ చేయవచ్చు. వాట్సాప్ ద్వారా AI-ప్రారంభించబడిన చాట్‌బాట్ సదుపాయం ఈ -కేటరింగ్ సేవలను కస్టమర్ అనుకూలంగా మారుస్తుందని IRCTC పేర్కొంది. 8750001323 నంబర్ ద్వారా ఆర్డర్ చేయచ్చు.