whatsapp: కొత్త ఏడాది కానుకగా వాట్సప్ నుంచి స్టిక్కర్లు,వీడియో కాల్‌లో ఎఫెక్ట్స్!
ఈ వార్తాకథనం ఏంటి
కొత్త సంవత్సరానికి స్వాగతం పలికే తరుణంలో వాట్సాప్ యూజర్లకు శుభవార్త చెప్పింది. నూతన సంవత్సర వేడుకలను స్నేహితులు,కుటుంబ సభ్యులతో మరింత ఉల్లాసంగా జరుపుకునేలా పలు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తన బ్లాగ్ పోస్టులో వెల్లడించింది. ఇందులో భాగంగా 2026 స్టిక్కర్ ప్యాక్‌తో పాటు వీడియో కాల్స్‌కు ప్రత్యేక ఎఫెక్ట్స్ వంటి ఫీచర్లను ప్రవేశపెడుతున్నట్లు తెలిపింది. సాధారణ రోజుల్లో వాట్సప్ వేదికపై రోజుకు సుమారు 100 బిలియన్ మెసేజ్‌లు, 2 బిలియన్ కాల్స్ జరుగుతాయని సంస్థ పేర్కొంది. నూతన సంవత్సర రోజున మాత్రం ఈ సంఖ్యలు ప్రతి ఏడాది కొత్త రికార్డులను సృష్టిస్తాయని,ఈసారి కూడా అలాగే ఉండొచ్చని అంచనా వేస్తోంది.
వివరాలు
కొత్త ఫీచర్లు ఇవే..
అందుకే యూజర్ల అనుభూతిని మరింత మెరుగుపరిచేందుకు ఈ ప్రత్యేక ఫీచర్లను జోడిస్తున్నామని, న్యూఇయర్ రోజంతా ఇవి అందుబాటులో ఉంటాయని స్పష్టం చేసింది. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని వాట్సప్ 2026 స్టిక్కర్ ప్యాక్‌ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. బంధువులు, స్నేహితులకు న్యూఇయర్ శుభాకాంక్షలు తెలియజేయడానికి ఇవి ఎంతో ఉపయోగపడతాయని తెలిపింది. ఈ స్టిక్కర్లను వ్యక్తిగత చాట్‌లతో పాటు గ్రూప్ చాట్‌లలో కూడా వినియోగించుకోవచ్చు. అలాగే వీడియో కాల్స్‌లో కొత్త ఎఫెక్ట్స్‌ను అందుబాటులోకి తీసుకొస్తోంది. న్యూఇయర్ సందర్భంగా వీడియో కాల్ చేస్తున్నప్పుడు స్క్రీన్‌పై ఫైర్‌వర్క్స్, రంగురంగుల కన్ఫెట్టి, నక్షత్రాల వంటి ఎఫెక్ట్స్‌ను జోడించుకునే అవకాశం కల్పిస్తోంది.
వివరాలు
కన్ఫెట్టి ఎమోజీని జోడిస్తే.. ప్రత్యేకమైన యానిమేషన్ ఫీచర్
ఇక ఏదైనా మెసేజ్‌కు కన్ఫెట్టి ఎమోజీని జోడిస్తే, ప్రత్యేకమైన యానిమేషన్ కనిపించేలా కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. మొదటిసారిగా స్టేటస్ విభాగంలో యానిమేటెడ్ స్టిక్కర్లను కూడా పరిచయం చేస్తున్నట్లు వాట్సప్ తెలిపింది. కాంటాక్ట్‌లలో ఉన్నవారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడానికి ఈ స్టిక్కర్లు ఉపయోగపడతాయని పేర్కొంది. అంతేకాకుండా నూతన సంవత్సర వేడుకల సమయంలో కార్యక్రమాలను సులభంగా ప్లాన్ చేసుకునేందుకు ఈవెంట్ ప్లాన్, పోల్స్, లైవ్ లొకేషన్, వాయిస్ నోట్స్, వీడియో నోట్స్ వంటి ఫీచర్లను వినియోగించుకోవాలని యూజర్లకు వాట్సప్ సూచించింది. ఇవి వేడుకలను మరింత సజావుగా నిర్వహించేందుకు దోహదపడతాయని తెలిపింది.