LOADING...
WhatsApp: వాట్సాప్‌తో ఇప్పుడు ఇతర మెసేజింగ్ యాప్స్‌తో కూడా చాట్ చేసే సౌకర్యం
వాట్సాప్‌తో ఇప్పుడు ఇతర మెసేజింగ్ యాప్స్‌తో కూడా చాట్ చేసే సౌకర్యం

WhatsApp: వాట్సాప్‌తో ఇప్పుడు ఇతర మెసేజింగ్ యాప్స్‌తో కూడా చాట్ చేసే సౌకర్యం

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 10, 2025
02:06 pm

ఈ వార్తాకథనం ఏంటి

వాట్సాప్ తాజాగా "థర్డ్ పార్టీ చాట్స్" అనే కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని ద్వారా ఇకపై వాట్సాప్ వాడని వ్యక్తులతో కూడా మీరు సందేశాలు పంపుకోవచ్చు, స్వీకరించవచ్చు. అంటే, పక్క యాప్ వాడుతున్నా కూడా మెసేజ్ చేయడం సాధ్యం అవుతుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ BirdyChat అనే యాప్‌తో మాత్రమే పనిచేస్తోంది. భవిష్యత్తులో మరిన్ని యాప్స్‌ను కూడా కలపడానికి వాట్సాప్ ప్లాన్ చేస్తోంది. అయితే అవి వాట్సాప్ భద్రతా నియమాలు, ఎన్‌క్రిప్షన్ ప్రమాణాలు పాటించాలి.

ఫీచర్ వివరాలు 

థర్డ్-పార్టీ చాట్‌లను ఎలా ఉపయోగించాలి 

వాట్సాప్‌లో Settings → Account → Third-party chats లోకి వెళ్లి ఈ ఆప్షన్‌ను యాక్టివేట్ చేయొచ్చు. దీని ద్వారా టెక్స్ట్, ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్స్, వాయిస్ మెసేజెస్ పంపుకోవచ్చు. అయితే, ప్రస్తుతం స్టికర్స్, డిసప్పియరింగ్ మెసేజెస్ వంటి ఫీచర్లు థర్డ్ పార్టీ చాట్స్‌లో ఇంకా అందుబాటులో లేవు.

వర్తింపు

EU డిజిటల్ మార్కెట్స్ చట్టం కారణంగా.. 

ఈ కొత్త ఫీచర్‌ను యూరోపియన్ యూనియన్ Digital Markets Act (DMA) నియమాల ప్రకారం తీసుకువచ్చారు. ఈ చట్టం ప్రకారం పెద్ద సోషల్ ప్లాట్‌ఫాంలు పరస్పరం కలిసి పనిచేసే విధంగా మారాలి. ఈ నేపథ్యంలో వాట్సాప్ యాప్‌కి ఈ మార్పులు వచ్చాయి. అయితే, యూజర్ గోప్యత (ప్రైవసీ) విషయమై భద్రతను తగ్గించకుండా ఈ ఫీచర్ రూపొందించామని వాట్సాప్ స్పష్టం చేస్తోంది. అయినప్పటికీ, మీరు వాట్సాప్‌లో బ్లాక్ చేసిన వ్యక్తి, ఇతర యాప్ ద్వారా మీకు మెసేజ్ పంపే అవకాశం ఉండొచ్చు — అది ఆ యాప్ రూల్స్‌పై ఆధారపడి ఉంటుంది.

విస్తరణ ప్రణాళికలు 

ముందు గ్రూప్ చాట్స్ కూడా రావచ్చు 

ప్రస్తుతం ఈ ఫీచర్ ఒక్కో వ్యక్తి మధ్య చాట్స్‌కే పరిమితం. భవిష్యత్తులో గ్రూప్ చాట్‌లు కూడా క్రాస్-ప్లాట్‌ఫామ్‌గా పనిచేసే విధంగా అప్‌డేట్స్ వచ్చే అవకాశం ఉంది. అలాగే యూజర్‌కు వచ్చే థర్డ్ పార్టీ మెసేజెస్‌ను వేరు ఇన్‌బాక్స్‌గా లేదా కలిపి ఒకేరకంగా చూపించే ఆప్షన్ కూడా ఇవ్వనున్నారు. అయితే వాట్సాప్ సూచన ఏమిటంటే.. ఇతర యాప్స్‌తో చాట్ చేసే ముందే, ఆ యాప్ వ్యక్తిగత డేటాను ఎలా ఉపయోగిస్తుందో పాలసీ చదవడం మంచిది.