Loading...
Whatsapp: వాట్సప్‌ గ్రూప్‌ చాట్‌లో కొత్త ఫీచర్లు..
వాట్సప్‌ గ్రూప్‌ చాట్‌లో కొత్త ఫీచర్లు..

Whatsapp: వాట్సప్‌ గ్రూప్‌ చాట్‌లో కొత్త ఫీచర్లు..

వ్రాసిన వారు Moogati Shabari
Aug 05, 2026
05:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ మెసెజింగ్‌ ప్లాట్‌ఫాం వాట్సప్‌.. గ్రూప్‌లు వినియోగదారుల కోసం కొత్త అప్‌డేట్లు తీసుకొచ్చింది. పోల్స్‌ను మరింత సులభం చేసింది. గ్రూప్‌ సభ్యులందరినీ ట్యాగ్‌ చేయడానికి @all అనే కొత్త ఆప్షన్‌ను పరిచయం చేసింది. గ్రూప్‌లోని సభ్యులతో మరో గ్రూప్‌నూ క్రియేట్‌ చేసే సదుపాయాన్నీ తీసుకొచ్చింది. ఇప్పటికే ఈ ఫీచర్లు చాలా మందికి అందుబాటులోకి వచ్చాయి. ఓసారి ప్రయత్నించండి.

వివరాలు

15 నిమిషాలలోపు ఎడిట్‌ చేసే ఆప్షన్‌..

వాట్సప్‌ గ్రూపులో ఏదైనా విషయంపై ఓటింగ్‌ కోసం పోల్స్‌ పెడుతుంటాం.

ఆ పోల్స్‌ మనం డిలీట్‌ చేసేంతవరకు అలానే ఉంటాయి. ఇకపై ఆ పోల్స్‌ ఎప్పుడు ముగియాలో టైమ్‌ సెట్‌ చేసుకోవచ్చు.

ఆ సమయం పూర్తికాగానే ఓటింగ్‌ ఆటోమెటిక్‌గా లాక్‌ అవుతుంది. పోల్స్‌కి ఎంత మంది ఓటు వేశారో, ఎవరెవరు స్పందించారో ఇకపై గ్రూప్‌ సభ్యులకు తెలియకుండా చేయొచ్చు.

పోల్‌ పట్టిన వ్యక్తికి మాత్రమే కనిపిస్తుంది. దీంతో గ్రూపు సభ్యులు వారి భావాలను ఎలాంటి మొహమాటం లేకుండా చెప్పొచ్చు.

పోల్ క్రియేట్ చేసిన తర్వాత 15 నిమిషాలలోపు ఎడిట్‌ చేసే ఆప్షన్‌ కూడా తెచ్చింది.

వివరాలు

అందర్నీ ఒకేసారి ట్యాగ్ చేసేలా..

ఏదైనా ముఖ్యమైన విషయాన్ని గ్రూప్‌లో పంచుకున్నప్పుడు అందరినీ ఒకేసారి ట్యాగ్‌ చేసేలా @all ఆప్షన్‌ను వాట్సప్‌ తీసుకొచ్చింది.

ఇలా మెన్షన్‌ చేసినప్పుడు ఒకేసారి అందరికీ నోటిఫికేషన్ వెళ్తుంది. 32 కంటే ఎక్కువ మంది ఉన్న గ్రూప్‌లకు మాత్రమే ప్రస్తుతం ఈ ఫీచర్‌ అందుబాటులో ఉంది.

ఈ ఆప్షన్ కేవలం అడ్మిన్లకే. గ్రూప్‌ చాట్‌లను మ్యూట్‌ చేసినా @all ఆప్షన్‌తో నోటిఫికేషన్‌ వస్తుంది. అది కూడా వద్దనుకుంటే అలర్ట్‌లను ప్రత్యేకంగా మ్యూట్ చేయొచ్చు.

ప్రస్తుతం ఉన్న గ్రూప్‌ల్లో కొంతమంది సభ్యులతో కలిసి సింగిల్‌ ట్యాప్‌తో వెంటనే ఇంకో గ్రూప్‌ క్రియేట్‌ చేయొచ్చు.

పుట్టినరోజులు వంటి సందర్భాల్లో అందులో ఒక్క సభ్యుడిని మినహా మిగిలినవారంతా ఏదైనా సర్‌ప్రైజ్‌ ప్లాన్‌ చేయాలన్నప్పుడు ఈ సిమిలర్‌ గ్రూప్‌ పనికొస్తుంది.

ADVERTISEMENT