WhatsApp: వాట్సాప్ 'స్టేటస్'ల కోసం కొత్త అప్డేట్.. ఇక నుంచి 'లైక్' చేసే అవకాశం
వాట్సాప్ ఎప్పటికప్పుడు యూజర్ల కోసం కొత్త అప్డేట్‌లను తీసుకొస్తూ వినియోగదారులు ఆకర్షిస్తోంది. తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో స్టోరీలకు యూజర్లు లైక్ ఎలా చేయవచ్చో అదే విధంగా వాట్సాప్ స్టేటస్‌లకు 'లైక్' చేసే అవకాశాన్ని కల్పించనుంది. వినియోగదారులు అప్డేట్ చేస్తున్నప్పుడు స్క్రీన్ దిగువ ఎడమ వైపున ఉన్న హార్ట్ ఎమోజీని నొక్కడం ద్వారా స్టేటస్ అప్డేట్ ను లైక్ చేయడానికి కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తేనుంది. దీంతో మన స్టేటస్‌ను ఎవరెవరు లైక్ చేశారో తెలుసుకోవచ్చు. చాటింగ్‌ను స్టార్ట్ చేయకుండానే కాంట్రాక్ట్స్‌తో కనెక్ట్ కావడానికి వీలు కల్పించే ఈజీ మార్గం ఇది.
త్వరలోనే అందరికీ అందుబాటులోకి
ఇక స్టేటస్ లైక్‌లు వేరుగా కనిపిస్తాయి కాబట్టి చాట్ కు అంతరాయం కలిగే వీలుండదు. స్టేటస్‌కు లైక్ లేదా లవ్ సింబల్ ద్వారా స్పందించడం మామూలు చాటింగ్ కన్నా భిన్నంగా ఉంటుంది. అయితే ఈ కొత్త ఫీచర్‌ను ప్రస్తుతం పబ్లిక్ బీటా యూజర్లు పరీక్షిస్తున్నారని, దానిపై కొంతకాలంగా రీసెర్చ్ జరుగుతోందని ఆ సంస్థ వెల్లడించింది. గూగుల్ ప్లే స్టోరో వాట్సాప్ తాజా వెర్సన్ 2.24. 17.21 ను ఇన్ స్టాల్ చేసుకున్న వాట్సాప్ బీటా యూజర్లకు మాత్రమే ఇది వర్తించనుంది. ఈ అప్డేట్ కొంతకాలానికి అందరికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.