Page Loader
Supermoon blue moon: ఆకాశంలో పెద్ద చందమామ.. సూపర్‌ మూన్.. ఎక్కడ, ఎలా చూడాలంటే?
ఆకాశంలో పెద్ద చందమామ.. సూపర్‌ మూన్.. ఎక్కడ, ఎలా చూడాలంటే?

Supermoon blue moon: ఆకాశంలో పెద్ద చందమామ.. సూపర్‌ మూన్.. ఎక్కడ, ఎలా చూడాలంటే?

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 18, 2024
03:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

సూపర్ మూన్‌లు సంవత్సరానికి 3-4 సార్లు సంభవిస్తాయి. అయితే ఈ ఆగస్టు నెలలో సూపర్‌ మూన్, బ్లూ మూన్ కలిసి రానున్నాయి. ఈ అరుదైన ఖగోళ ఘటనను చూడటానికి ప్రజలంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇది దశాబ్దానికి ఓసారి మాత్రమే జరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆగస్టులో వచ్చే పౌర్ణమికి 'స్టర్జన్ మూన్' అంటారు. ఏడాది వరుసగా రాబోతున్న నాలుగో సూపర్ మూన్ లలో ఇది మొదటిది కావడం విశేషం. ఈ అరుదైన సూపర్ మూన్ బ్లూమూన్ ఆగస్టు 19, 2024న కనపించనుంది.

Details

చంద్రుని కంటే 30శాతం ప్రకాశవంతంగా కనిపించనుంది

రోజు ఉంటే చంద్రుని కాంతి కంటే 30 శాతం ప్రకాశవంతంగా చందమామ కనిపించనుంది. మీరుండే ప్రదేశం బట్టి, టైమ్ జోన్ ప్రకారం ఈ అద్భుత దృశ్యం కనిపించే సమయం మారుతుంది. భారతదేశంలో ఆగస్టు 19 రాత్రి నుండి ఆగస్టు 20 తెల్లవారుజాము వరకు కనిపించనుంది. ఒకవేళ బయటి వాతావరణం నేరుగా చంద్రుణ్ని చూడ్డానికి సహకరించకపోతే ఏదైనా లైవ్ స్ట్రీమింగ్ చూసి ఆనందించండి.