LOADING...
Blue Origin: బ్లూ ఆరిజిన్ నాసా మార్స్ మిషన్ ప్రయోగాన్ని మళ్ళీ ఎందుకు వాయిదా వేసింది
బ్లూ ఆరిజిన్ నాసా మార్స్ మిషన్ ప్రయోగాన్ని మళ్ళీ ఎందుకు వాయిదా వేసింది

Blue Origin: బ్లూ ఆరిజిన్ నాసా మార్స్ మిషన్ ప్రయోగాన్ని మళ్ళీ ఎందుకు వాయిదా వేసింది

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 13, 2025
10:28 am

ఈ వార్తాకథనం ఏంటి

ఫ్లోరిడాలోని కేప్ కనావెరల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్‌ నుండి జరగాల్సిన బ్లూ ఆరిజిన్‌ "న్యూ గ్లెన్" రాకెట్‌ ప్రయోగం మరోసారి వాయిదా పడింది. దీనికి కారణం, తీవ్ర సౌర తుఫానులు (Solar Storms) అని సంస్థ ప్రకటించింది. ఈ రాకెట్‌లో నాసా ఇఎస్‌కేపేడ్‌ (ESCAPADE) అనే జంట ఉపగ్రహాలను మంగళగ్రహం వైపు పంపేందుకు సిద్ధం చేశారు. ఇది ఇప్పటికే రెండోసారి వాయిదా. నవంబర్‌ 9న వాతావరణ సమస్యల వల్ల ప్రయోగం రద్దయిన విషయం తెలిసిందే. తాజాగా, సూర్యుని నుంచి వెలువడిన బలమైన కరోనల్ మాస్ ఎజెక్షన్‌ (CME) కారణంగా, ప్రయోగాన్ని మళ్లీ నిలిపివేయాల్సి వచ్చింది.

మిషన్ వివరాలు 

ప్రయోగం ఆలస్యానికి కారణం

మంగళవారం రాత్రి (భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 1:20 గంటలకు) న్యూ గ్లెన్‌ రాకెట్‌ టేకాఫ్‌ కావాల్సింది. అయితే సౌర తుఫానుల ప్రభావం వల్ల ఇఎస్‌కేపేడ్‌ స్పేస్‌క్రాఫ్ట్‌ భద్రతకు ముప్పు ఏర్పడే అవకాశం ఉందని గుర్తించిన నాసా, ప్రయోగాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. బ్లూ ఆరిజిన్‌ ఇప్పుడు కొత్త తేదీలపై పరిశీలన చేపట్టింది.

ప్రాముఖ్యత

మంగళ గ్రహ వాతావరణంపై అధ్యయనం చేయనున్న ఇఎస్‌కేపేడ్‌ మిషన్

ఇది 2020లో "పర్సివీరెన్స్‌ రోవర్‌" తర్వాత నాసా చేపట్టిన మొదటి మార్స్‌ మిషన్‌. రాకెట్‌ ల్యాబ్‌ నిర్మించిన ఈ రెండు ఉపగ్రహాలు, సౌర గాలులు (Solar Wind) మంగళగ్రహ వాతావరణాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో అధ్యయనం చేయనున్నాయి. ఇటీవల సూర్యుడి చురుకుదనం పెరగడంతో, భూమి వాతావరణం,అంతరిక్ష వాతావరణం మధ్య పెద్దస్థాయి ప్రభావాలు కనిపిస్తున్నాయి.

తుఫాను ప్రభావాలు 

సౌర ఉద్గారమే ఆలస్యానికి కారణం

సౌర చక్రంలోని అత్యంత శక్తివంతమైన సన్‌స్పాట్‌ సమూహం AR4274, ఇటీవల భూమి వైపుకు భారీ G4 స్థాయి కరోనల్ మాస్ ఎజెక్షన్‌ విడుదల చేసింది. ఈ ఘటన వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆరోరాలు (auroras) కనిపించాయి. అదే సమయంలో, న్యూ గ్లెన్‌ ప్రయోగానికి కూడా ఆటంకం ఏర్పడింది. ప్రస్తుతం, బ్లూ ఆరిజిన్‌ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్‌ (FAA)తో కలిసి కొత్త ప్రయోగ సమయం నిర్ణయించే పనిలో ఉంది. కాగా, అమెరికాలో ప్రస్తుతం పగటిపూట వాణిజ్య ప్రయోగాలపై తాత్కాలిక నిషేధం కొనసాగుతోంది.