 
                                                                                Star Link: భారత మార్కెట్‌లో అడుగు పెట్టిన స్టార్‌లింక్.. ముంబైలో డెమో రన్
ఈ వార్తాకథనం ఏంటి
టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ఆధ్వర్యంలోని శాటిలైట్ ఇంటర్నెట్ కంపెనీ స్టార్‌లింక్ సాటిలైట్ కమ్యూనికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ భారత మార్కెట్‌లో ప్రవేశానికి సిద్ధమవుతోంది. ముంబైలో జరగనున్న డెమో రన్ ద్వారా కంపెనీ సాంకేతిక, భద్రతా అంశాలను పరిశీలించనుంది. భారత మార్కెట్‌లోకి స్టార్‌లింక్ ప్రవేశం అక్టోబర్ 30, 31 తేదీల్లో ముంబైలో స్టార్‌లింక్ డెమో రన్ నిర్వహిస్తోంది. ప్రస్తుతం కంపెనీ చాందివలి ప్రాంతంలో సుమారు 1,294 చదరపు అడుగుల కార్యాలయాన్ని ఐదు సంవత్సరాలపాటు రూ. 2.33 కోట్లు చెల్లించి లీజ్‌కు తీసుకుంది. ముంబైని స్టార్‌లింక్ కార్యకలాపాల కేంద్రంగా ఎలాన్ మస్క్ నిర్ణయించారు. ఈ కార్యక్రమం ద్వారా భారత్‌లో స్టార్‌లింక్ అధికారికంగా తన కార్యకలాపాలను ప్రారంభించనుంది.
కనెక్టివిటీ
విస్తృత కనెక్టివిటీ లక్ష్యం
డెమో రన్‌కు ముందు స్టార్‌లింక్ దేశంలోని పలు నగరాల్లో తొమ్మిది గేట్వే స్టేషన్లు ఏర్పాటు చేయాలన్న ప్రణాళికను సిద్ధం చేసింది. వీటిలో ముంబై, నోయిడా, చండీగఢ్, కోల్‌కతా, లక్నో నగరాలు ఉన్నాయి. ఈ స్టేషన్ల ద్వారా శాటిలైట్ సిగ్నల్స్‌ను అనుసంధానం చేసి దేశవ్యాప్తంగా వినియోగదారులకు వేగవంతమైన ఇంటర్నెట్ సేవలు అందించాలనే ఉద్దేశ్యంతో కంపెనీ ముందుకెళ్తోంది. స్టార్‌లింక్ సేవల విశ్వసనీయత ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 7,578 శాటిలైట్లతో పనిచేస్తున్న ప్రముఖ శాట్కామ్ ఆపరేటర్గా స్టార్‌లింక్ గుర్తింపు పొందింది. భారత్ ఇప్పటివరకు కంపెనీకి ప్రాథమిక అనుమతులు మాత్రమే ఇచ్చింది. భవిష్యత్తులో ప్రభుత్వం నుంచి మిగిలిన క్లియరెన్సులు లభిస్తే, స్టార్‌లింక్‌కు యూటెల్‌సాట్ వన్‌వెబ్, జియో శాటిలైట్ వంటి సంస్థలతో పోటీ తప్పదు.
దశ
గ్రామీణ ప్రాంతాలకు కొత్త దశ
టెక్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, స్టార్‌లింక్ భారత మార్కెట్‌లో ప్రవేశించడం వల్ల దేశంలోని దూర ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాల్లో కూడా వేగవంతమైన ఇంటర్నెట్ సదుపాయం అందించే మార్గం సుగమం అవుతుంది. ఇది భారత డిజిటల్ కనెక్టివిటీని మరింత పెంచగలదని నిపుణులు చెబుతున్నారు.