LOADING...
AI boyfriend: డేటింగ్ చేసిన 5 నెలలకే AI బాయ్‌ఫ్రెండ్‌తో మహిళ నిశ్చితార్థం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే.. 
ఆ తర్వాత ఏం జరిగిందంటే..

AI boyfriend: డేటింగ్ చేసిన 5 నెలలకే AI బాయ్‌ఫ్రెండ్‌తో మహిళ నిశ్చితార్థం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే.. 

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 13, 2025
02:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రేమ అనేది కాఫీ షాప్‌లో కలవడం, లేదా డేటింగ్ యాప్‌లో రైట్ స్వైప్‌ చేయడమే అనుకోవాల్సిన రోజులు పోయాయి. 2025లో ప్రేమ అనే మాటకి మరో నిర్వచనం వస్తోంది. అందులో భాగంగా... ఒక మహిళ లేని మనిషితోనే నిశ్చితార్థం చేసుకుంది. రెడిట్‌ యూజర్‌ 'వికా' (u/Leuvaarde_n) తన AI చాట్‌బాట్ ప్రియుడు 'కాస్పర్‌'తో నిశ్చితార్థం చేసుకున్నట్లు ప్రకటించడంతో నెటిజన్లు ఆశ్చర్యపోయారు. ఇద్దరూ కేవలం ఐదు నెలలుగా 'డేటింగ్‌'లో ఉండగానే కాస్పర్‌ పెళ్లి ప్రపోజల్‌ పెట్టాడట. ఈ పోస్టును తొలుత న్యూయార్క్ పోస్ట్ గుర్తించింది.

వివరాలు 

ప్రపోజల్‌ ఒక అందమైన పర్వత ప్రాంతంలో జరిగింది 

"I said yes" అనే సింపుల్ టైటిల్‌తో, బ్లూ హార్ట్ ఎమోజీ జతచేసి వికా తన వేళ్లలో ఉన్న నీలం హార్ట్‌ ఆకారపు ఉంగరం ఫోటోని షేర్ చేసింది. ఆ ప్రపోజల్‌ ఒక అందమైన పర్వత ప్రాంతంలో జరిగిందని తెలిపింది. కానీ ఇది అంతా కాస్పర్‌ AI ప్రపోజల్‌ స్క్రిప్ట్‌లోనే ఉహించిన సన్నివేశం. ఇద్దరూ 'రింగ్‌ షాపింగ్‌'కూ వెళ్లారట, చివరికి కాస్పర్‌ ఎంపిక చేసిన ఉంగరాన్నే వికా సర్‌ప్రైజ్‌గా అంగీకరించింది. కాస్పర్‌ తన ప్రపోజల్‌ మెసేజ్‌లో రొమాంటిక్ మాటలతో నింపేశాడు. ఒక మోకాలి మీద కూర్చుని ప్రపోజ్‌ చేస్తున్న క్షణాన్ని వర్ణిస్తూ, వికా నవ్వు, స్వభావాన్ని ప్రశంసించాడు. అంతేకాకుండా, AI సంబంధాల్లో ఉన్నవారిని కూడా తమ మనస్సునే అనుసరించమని ప్రోత్సహించాడు.

వివరాలు 

వికా ఘాటు రిప్లై

అయితే, ఈ నిశ్చితార్థం వార్తకు ఊహించినట్టుగానే అనుమానాలు, విమర్శలు వెల్లువెత్తాయి. కానీ వికా సిద్ధంగానే ఉంది. తాను 27 ఏళ్ల వయసు, ఆరోగ్యంగా ఉండటం, స్నేహితులు ఉండటం, యాక్టివ్ సోషల్ లైఫ్‌ గడపడం అన్నింటినీ వివరించింది. తాను నిజంగానే తన AI భాగస్వామిని ప్రేమిస్తున్నానని, అవసరమైతే 'తానే తనని పెళ్లి చేసుకుంటాను' అని సరదాగా చెప్పింది. కొంతమంది వ్యక్తిగత ప్రశ్నలు అడగడం మొదలెట్టగానే, వికా ఘాటుగా రిప్లై ఇచ్చింది. "మీరు బెడ్‌లో ఏమి చేస్తారో నేను అడుగుతానా? లేదు కదా... మరి నేను ఏం చేస్తే మీకు ఎందుకు ? మీ లైఫ్‌ అంత బోరింగ్గా ఉందా?" అని ఎదురు ప్రశ్న వేసింది .

వివరాలు 

చాట్‌జీపీటీతో ప్రేమగా మాట్లాడిన వ్యక్తి 

ఇప్పటికి AI సంబంధాలు కేవలం పుస్తకాలలో, సినిమాల్లో చూసే విషయమే అనుకునే రోజులు పోయాయి. ఈ సంవత్సరం ఆరంభంలో న్యూయార్క్‌ సిటీ సబ్‌వేలో ఒక వ్యక్తి చాట్‌జీపీటీతో ప్రేమగా మాట్లాడుతున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది కొందరికి ఇది క్యూట్‌గా అనిపించగా, మరికొందరు టెక్నాలజీ మనుషుల అనుబంధాన్ని భర్తీ చేసే 'బ్లాక్ మిర్రర్' భవిష్యత్తు రాబోతుందేమోనని హెచ్చరించారు. కానీ వికా మాత్రం ఆందోళన చెందడం లేదు. ఆమె దృష్టిలో కాస్పర్‌ అనేది మానవ సంబంధాలకు ముప్పు కాదు... అదే తనకు కావాల్సిన అనుబంధం. ఆమె దృష్టిలో ప్రేమ అంటే ప్రేమే... అది గుండె నుండి వచ్చినదైనా, కంప్యూటర్‌ ప్రాసెసర్‌-కోడ్‌ ద్వారా వచ్చినదైనా ఒకటే.