Loading...
Historic climate warning:ప్రపంచంలో తొలిసారి వరుసగా ఆరు రోజులు 2 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

Historic climate warning:ప్రపంచంలో తొలిసారి వరుసగా ఆరు రోజులు 2 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 26, 2026
03:25 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచ ఉష్ణోగ్రతలు ప్రమాదకర స్థాయికి చేరుకుంటున్నాయి. పారిశ్రామిక విప్లవానికి ముందు నమోదైన సగటు ఉష్ణోగ్రతలతో పోలిస్తే.. భూమిపై ఉష్ణోగ్రతలు వరుసగా ఆరు రోజుల పాటు 2 డిగ్రీల సెల్సియస్‌కు పైగా నమోదయ్యాయి. ఇంత సుదీర్ఘకాలం ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు కొనసాగడం ఇదే తొలిసారి. వాతావరణ మార్పులపై ఆందోళన వ్యక్తం చేస్తున్న శాస్త్రవేత్తలకు ఈ పరిణామం మరింత కలవరపెడుతోంది. సోమవారం నాటికి ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు పారిశ్రామిక విప్లవానికి ముందు స్థాయితో పోలిస్తే ఏకంగా 2.24 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదయ్యాయి. అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం ఇదే ఇప్పటివరకు నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత వ్యత్యాసం. రానున్న రోజుల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

వివరాలు 

ఎల్‌నినో ప్రభావంతో అడవుల్లో కరవు, కార్చిచ్చు ముప్పు

2023 నవంబర్, 2024 ఫిబ్రవరిలోనూ ప్రపంచ ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల మార్కును దాటాయి.

అయితే ఈసారి నమోదైనంత ఎక్కువ ఉష్ణోగ్రతలు, ఇంత సుదీర్ఘకాలం కొనసాగలేదు.

మానవ కార్యకలాపాల వల్ల పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్‌తో పాటు ప్రస్తుతం ఏర్పడుతున్న బలమైన ఎల్‌నినో పరిస్థితులు ఈ ఉష్ణోగ్రతల పెరుగుదలకు ప్రధాన కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ప్రస్తుతం కొనసాగుతున్న ఎల్‌నినో ప్రభావం జనవరి నాటికి గరిష్ఠ స్థాయికి చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు.

పెరుగుతున్న వేడి కారణంగా అటవీ ప్రాంతాల్లో కరవు, కార్చిచ్చు వంటి సమస్యలు తీవ్రమవుతున్నాయి.

ఇండోనేసియా, అమెజాన్‌ అడవుల్లో ఇప్పటికే ఈ ప్రభావం కనిపిస్తోంది.

కరవు కారణంగా చెట్లు, మొక్కల పెరుగుదల తగ్గి వాతావరణంలోని కార్బన్ డయాక్సైడ్‌ను పీల్చుకునే సామర్థ్యం కూడా తగ్గుతోంది.

వివరాలు 

పెరుగుతున్న కార్బన్ ఉద్గారాలు.. పారిస్ ఒప్పంద లక్ష్యానికి ముప్పు

ఫలితంగా గాలిలో కార్బన్ డయాక్సైడ్ పరిమాణం మరింత పెరగనుంది.

వచ్చే ఏడాదికి వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ ఏకంగా 3.5 పార్ట్స్ పర్ మిలియన్ (ppm) పెరగవచ్చని బ్రిటన్ వాతావరణ శాఖ అంచనా వేసింది.

2015లో కుదిరిన పారిస్ వాతావరణ ఒప్పందం ప్రకారం.. ప్రపంచ ఉష్ణోగ్రతల పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్‌కు పరిమితం చేయాలని దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి.

అయితే ప్రస్తుత పరిణామాలు ఆ లక్ష్యాన్ని చేరుకోవడం మరింత కష్టంగా మారుతోందని సూచిస్తున్నాయి.

ఈ ఏడాది వేసవిలో యూరోపియన్ యూనియన్‌లో వేడి కారణంగా 50 వేల మందికి పైగా, బ్రిటన్‌లో సుమారు 5 వేల మంది ప్రాణాలు కోల్పోయినట్లు అంచనాలు చెబుతున్నాయి.

ADVERTISEMENT

వివరాలు 

పెరుగుతున్న వేడి.. మౌలిక సదుపాయాలకు ముప్పు

రహదారులు కరిగిపోవడం, రైలు మార్గాలు దెబ్బతినడం, పాఠశాలలు మూతపడటం, ఆసుపత్రులపై ఒత్తిడి పెరగడం వంటి సమస్యలు కూడా తీవ్రతరమవుతున్నాయి.

భవిష్యత్తులో ఈ ముప్పును తగ్గించాలంటే ప్రభుత్వాలు ఒకవైపు పెరుగుతున్న ఉష్ణోగ్రతలను ఎదుర్కొనేలా మౌలిక సదుపాయాలను సిద్ధం చేయాలి.

మరోవైపు బొగ్గు, చమురు, గ్యాస్ వంటి శిలాజ ఇంధనాల వినియోగాన్ని వేగంగా తగ్గించి గ్రీన్‌హౌస్ వాయువుల విడుదలను నియంత్రించాలని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

ADVERTISEMENT