LOADING...
WWDC 2026: సిరి AI నుంచి iOS 27 వరకు.. ఆపిల్ అదిరిపోయే 10 అప్‌డేట్స్!
సిరి AI నుంచి iOS 27 వరకు.. ఆపిల్ అదిరిపోయే 10 అప్‌డేట్స్!

WWDC 2026: సిరి AI నుంచి iOS 27 వరకు.. ఆపిల్ అదిరిపోయే 10 అప్‌డేట్స్!

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 09, 2026
08:25 am

ఈ వార్తాకథనం ఏంటి

WWDC 2026లో టెక్ దిగ్గజం ఆపిల్ మరోసారి తన సరికొత్త టెక్నాలజీలతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. గంటకు పైగా సాగిన కీనోట్ ఈవెంట్‌లో iOS 27, macOS Golden Gate, Apple Intelligence కొత్త ఫీచర్లు, పూర్తిగా అప్‌గ్రేడ్ అయిన Siri AIతో పాటు పలు కీలక అప్‌డేట్లను ప్రకటించింది. Photos, Safari, Messages, Calendar, Home, Shortcuts వంటి రోజువారీ యాప్స్‌లో Artificial Intelligence సామర్థ్యాలను జోడించి యూజర్ అనుభవాన్ని మరింత మెరుగుపరిచింది. WWDC 2026లో ఆపిల్ ప్రకటించిన టాప్-10 కీలక అప్‌డేట్లు ఇవే.

#1

కొత్త అవతారంలో సిరి AI

ఈ ఏడాది ఈవెంట్‌లో ప్రధాన ఆకర్షణ Siri AI. యూజర్లు చాలాకాలంగా ఎదురుచూస్తున్న Personal Context,On-screen Awareness,In-app Actions వంటి ఫీచర్లను Apple అందుబాటులోకి తీసుకొచ్చింది. Dynamic Islandలో కొత్త యానిమేషన్లతో Siri కనిపిస్తుంది. Siriతో మాట్లాడే సమయంలో Dynamic Island విస్తరిస్తూ ప్రత్యేక అనుభూతిని కలిగిస్తుంది. Google Custom Gemini Model మద్దతుతో పనిచేసే ఈ అసిస్టెంట్‌కు అధికారికంగా Siri AI అని పేరు పెట్టింది Apple. ఇకపై ఇది కేవలం Voice Assistant మాత్రమే కాదు. చాట్ చేయడం,కొత్త ఆలోచనలు ప్లాన్ చేయడం, ట్రిప్ షెడ్యూల్స్ సిద్ధం చేయడం వంటి పనుల్లో కూడా సహాయపడుతుంది.

#2

Siri కోసం ప్రత్యేక App

"Hey Siri" అని పిలిచినా, Dynamic Islandను కిందికి స్వైప్ చేసినా, Power Button నొక్కినా Siri AI యాక్టివ్ అవుతుంది. iPad, Macల్లో Spotlight Search ద్వారా కూడా దీన్ని ఉపయోగించవచ్చు. చాట్‌జీపీటీ, జెమినీ తరహాలో Siri కోసం Apple ప్రత్యేక Standalone Appను పరిచయం చేసింది. App ఓపెన్ చేసిన వెంటనే గత Conversations కనిపిస్తాయి. Pencil Iconపై ట్యాప్ చేసి కొత్త Chat ప్రారంభించవచ్చు. ఈ App iPhone, iPad, Apple Watch, Apple Vision Pro, Macల్లో పనిచేస్తుంది. ఒక డివైస్‌లో ప్రారంభించిన Conversationను మరో డివైస్‌లో కొనసాగించే అవకాశం ఉంటుంది.

Advertisement

#3

iPhone Cameraకు AI పవర్

iPhone Camera Appలో కొత్త Siri Modeను Apple తీసుకొచ్చింది. Cameraను ఏదైనా వస్తువు, ప్రదేశం, డాక్యుమెంట్ లేదా ఆహారంపై ఫోకస్ చేసి Siriని ప్రశ్నిస్తే దానికి సంబంధించిన వివరాలు అందిస్తుంది. అలాగే Hotel Billsను Scan చేసి Apple Cash ద్వారా స్నేహితులతో Bill Split చేయడంలో Siri సహాయపడుతుంది. మరోవైపు Food Plateను Cameraలో చూపిస్తే అందులోని Calories, Nutritional Valuesను వెంటనే అంచనా వేసి చూపిస్తుంది.

Advertisement

#4

సిరి పవర్డ్ రైటింగ్ టూల్స్

ఆపిల్ ఆపరేటింగ్ సిస్టమ్స్(Apple Operating Systems)లో System-wide Writing Tools అందుబాటులోకి వచ్చాయి. సాధారణ భాషలో సూచనలు ఇస్తే Text Generate చేయడం, Edit చేయడం సాధ్యమవుతుంది. అంతేకాదు, మెసేజస్ పంపే ముందు Grammar, Spelling Errorsను సరిచేస్తుంది. యూజర్ మాట్లాడే వ్యక్తి, Conversation Tone, Punctuation ఆధారంగా Writing Styleను కూడా మార్చుకుంటుంది.

#5

ఫొటోస్ యాప్‌కు ఏఐ మేకోవర్

Photos Appలో మూడు ప్రధాన AI ఫీచర్లను Apple జోడించింది. Clean Up: ఫొటోల్లోని అనవసర వస్తువులను తొలగించి Natural Backgroundను Fill చేస్తుంది. Expand: ఫొటో అసలు Sizeను దాటి Missing Areasను AIతో రూపొందించి Imageను విస్తరిస్తుంది. Spatial Reframe: ఫొటో తీసిన తర్వాత కూడా Angle, Perspective మార్చి వేరే కోణంలో తీసినట్లుగా చూపిస్తుంది. AI ద్వారా Edit చేసిన ప్రతి ఫొటోకు SynthID Hidden Watermark జోడించబడుతుంది.

#6

Safari Browserలో కొత్త AI ఫీచర్లు

Safari Browserలో AI ఆధారిత పలు కొత్త సదుపాయాలు వచ్చాయి. Open చేసిన Tabsను వాటి Subject ఆధారంగా Auto Group చేస్తుంది. "Notify Me" ఫీచర్ ద్వారా ఇష్టమైన E-commerce Product ధర తగ్గినా లేదా Stockలోకి వచ్చినా Notification అందుతుంది. Weak Passwordలను Strong Passwordలుగా మార్చడంతో పాటు Custom Extensionsను కేవలం Text Promptతో AI ద్వారా Create చేసుకోవచ్చు.

#7

Image Playground మరింత Powerful

Image Playgroundను Advanced AI Modelతో Apple అప్‌డేట్ చేసింది. Private Cloud Compute రక్షణతో Photorealistic Images రూపొందించవచ్చు. Text Promptsతో Image Editing, Object Selection, Aspect Ratio మార్చడం, Wallpapers తయారు చేయడం సులభమవుతుంది. వీటికి కూడా SynthID Watermark ఉంటుంది.#8 Messages, Mail, Calendarకు AI అప్‌డేట్స్Apple Intelligence ఇప్పుడు Messages, Mail, Calendar, Phone Appsలో కూడా అందుబాటులోకి వచ్చింది. Messagesలో Chat చేస్తుండగా Reminders లేదా Notes Suggest చేస్తుంది. Mail, Messagesలో Smart Reply ఫీచర్ ఉంటుంది. Calendarలో Voice Commandతోనే Contacts, Location వివరాలను గుర్తించి Event Create అవుతుంది.

#9

Shortcuts Creation ఇక మరింత సులభం

Phone Appలో Call Context ద్వారా కాల్ చేస్తున్న వ్యక్తికి సంబంధించిన ముఖ్యమైన సమాచారం Screenపై కనిపిస్తుంది. Coding అవసరం లేకుండానే సాధారణ భాషలో చెప్పి Shortcuts రూపొందించుకోవచ్చు. ఉదాహరణకు, రేపటి Calendar Schedule ఆధారంగా ఈరోజే Alarm Set చేయడం, Food Delivery Notification రాగానే ఇంటి బయట Lights On చేయడం వంటి Automationలను AI Shortcuts ద్వారా సెట్ చేయవచ్చు.

#10

iOS 27లో భారీ మార్పులు

iOS 27లో Liquid Glass Displayను Apple మరింత మెరుగుపరిచింది.Text స్పష్టంగా కనిపించేలా Foreground,Background Contentను వేరు చేస్తుంది. Settingsలో Slider ద్వారా Transparencyని Ultra Clear నుంచి Fully Tinted వరకు మార్చుకోవచ్చు. Performance పరంగా కూడా iOS 27 వేగాన్ని పెంచింది.Apps 30శాతం వేగంగా Open అవుతాయి. Photos 70శాతం త్వరగా Load అవుతాయి.AirDrop Transfer Speed 80శాతం పెరిగింది. External Drive Data Transfer Speed ఐదు రెట్లు అధికమైంది. Spotlight, Photos, Mail Appsలో Search అనుభవం కూడా మరింత సులభంగా మారిందని Apple వెల్లడించింది. WWDC 2026లో ప్రకటించిన ఈ AI ఆధారిత ఫీచర్లు Apple Ecosystemను మరింత స్మార్ట్‌గా మార్చనున్నాయని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement