షావోమీ మొబైల్స్: MIUI ని పక్కన పెట్టేసి హైపర్ ఓఎస్ ని తీసుకొచ్చిన సంస్థ
షావోమి మొబైల్స్ వాడే వారికి MIUI గురించి చెప్పాల్సిన పనిలేదు. షావీమీ మొబైల్స్ లో MIUI ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. ఎన్నో ఏళ్లుగా ఇదే ఆపరేటింగ్ సిస్టమ్ ని షావోమి సంస్థ తన మొబైల్స్ కి వాడుతూ వస్తోంది. అయితే తాజాగా ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ని పక్కన పెట్టేసింది. అవును, మీరు విన్నది నిజమే. షావోమి 14 సిరీస్ మొబైల్ ని తీసుకొస్తున్న సంస్థ MIUI ఆపరేటింగ్ సిస్టమ్ ని పక్కన పెట్టేసి హైపర్ ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ ని తీసుకొచ్చింది. మరికొన్ని రోజుల్లో హైపర్ ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ ని షావోమీ చెందిన అన్ని మొబైల్స్ లో తీసుకురానున్నారు.
ప్రస్తుతం కేవలం చైనాలో మాత్రమే
ప్రస్తుతానికి కేవలం చైనా మార్కెట్లో మాత్రమే షావోమి 14 సిరీస్ స్మార్ట్ ఫోన్లలో హైపర్ ఓఎస్ ని తీసుకొచ్చారు. మరికొద్ది రోజుల్లో మిగతా దేశాల షావోమీ స్మార్ట్ ఫోన్లలో కూడా హైపర్ ఓఎస్ ని పరిచయం చేయబోతున్నారు. మరి హైపర్ ఓఎస్ పనితీరు ఎలా ఉంటుందనేది ఇప్పటికైతే ఎవ్వరికీ తెలియదు. కానీ మార్కెట్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, MIUI కంటే హైపర్ ఓ ఎస్ మరింత షార్ప్ గా పనిచేయని మరిన్ని ఫీచర్లతో నిండిపోయి ఉందని తెలుస్తోంది. షావోమి కంపెనీకి చెందిన రెడ్ మీ, ఎమ్ఐ, పోకో మొదలగు ఫోన్లలో మరికొద్ది రోజుల్లో హైపర్ ఓఎస్ వచ్చే అవకాశం ఉంది.