LOADING...
Year Ender 2025: భారత ట్రెండ్స్‌లో 2025లో హాట్ టర్మ్‌ - 5201314!.. దీని అసలు అర్థం ఏమిటి?
భారత ట్రెండ్స్‌లో 2025లో హాట్ టర్మ్‌ - 5201314!.. దీని అసలు అర్థం ఏమిటి?

Year Ender 2025: భారత ట్రెండ్స్‌లో 2025లో హాట్ టర్మ్‌ - 5201314!.. దీని అసలు అర్థం ఏమిటి?

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 11, 2025
02:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

2025లో భారతీయులు గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన ప్రత్యేక సంఖ్యల క్రమం 5201314. తాజాగా విడుదల చేసిన గూగుల్ 'వార్షిక సెర్చ్ రిపోర్ట్' రిపోర్ట్‌లో ఈ సంఖ్య కూడా "Mayday", "Stampede"వంటి పదాలతో పాటు టాప్ ట్రెండింగ్ సెర్చ్‌ల జాబితాలో చోటు దక్కించుకుంది. అయితే ఈ సంఖ్యలు అలా కనిపించినంత రాండమ్ కాదు. నిజానికి, ఇది డిజిటల్ కమ్యూనికేషన్‌లో ఉపయోగించే ప్రేమ సందేశం. మాండరిన్‌ భాషలో ఉన్న పదాలతో వీటి శబ్దాలు దగ్గరగా ఉండటం వల్ల దీని అర్థం రూపుదిద్దుకుంది. 520 అనే సంఖ్య మాండరిన్‌లోని wǒ ài nǐ(I Love You)లాగా వినిపిస్తుంది. అలాగే 1314 అనేది yī shēng yī shì (for a lifetime)అన్న భావానికి దగ్గరగా ఉంటుంది.

వివరాలు 

సోషల్ మీడియా, ప్రేమ స్లాంగ్‌లు… కొత్త ట్రెండ్

కలిపి చూస్తే 5201314 అంటే — "నిన్ను జీవితాంతం ప్రేమించాను/ప్రేమిస్తూనే ఉంటాను" అన్న అర్థం వస్తుంది. ఇప్పుడు సోషల్ మీడియా ప్రభావం పెరిగినకొద్దీ డిజిటల్ స్లాంగ్‌లు కూడా విపరీతంగా పెరిగాయి. ఇన్‌స్టాగ్రామ్, షార్ట్ వీడియో యాప్స్, మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌లు.. ఇవన్నీ యువతను ఇలాంటి కోడ్‌లను, సంఖ్యల ప్రేమ సందేశాలను వాడేలా మార్చాయి. చైనా, కొరియా, జపాన్, పాశ్చాత్య దేశాల్లో ఇది చాలా కాలం నుంచే ఉన్న ట్రెండ్. ఇప్పుడు భారతీయులు కూడా ఇదే విధంగా ఈ కొత్త స్లాంగ్‌లను ఉపయోగించడం మొదలుపెట్టారు.

వివరాలు 

సంఖ్యలు ఎలా ప్రేమ సందేశాలుగా మారిపోయాయి? 

5201314 అనే సంఖ్య మొదట చైనీస్ సోషల్ మీడియాలో పాపులర్ అయింది. క్యాప్షన్‌లు,రిలేషన్‌షిప్ స్టేటస్‌లు,రీల్స్,టిక్‌టాక్ వీడియోలు,ప్రైవేట్ మెసేజ్‌లలో ఇది విపరీతంగా వాడటం ప్రారంభించారు. ఇలా అందరి ఫీడ్‌లో ఈ సంఖ్య కనిపించడంతో,దీని అర్థం ఏమిటో తెలుసుకోవాలనే ఆసక్తి ఎక్కువమంది నెటిజన్లలో కలిగింది. చివరికి గూగుల్‌లో దీనిని సెర్చ్ చేసే వారి సంఖ్య భారీగా పెరిగి,ఇది భారతదేశంలో అత్యధికంగా సెర్చ్ చేసిన టర్మ్‌లలో ఒకటిగా మారింది. భారతీయులకు ఇది కొత్తేమీ కాదు.మన దగ్గర కూడా 143 అన్న సంఖ్యను "I Love You"అనే అర్థంతో చాలా కాలంగా వాడుతున్నారు. ముఖ్యంగా పాత ఫోన్ల కాలంలో పూర్తి మెసేజ్‌లు టైప్ చేయడం కష్టంగా ఉండటంతో,ఇలా సంఖ్యలతో ప్రేమ సందేశాలు పంపడం యువతలో పెద్ద ట్రెండ్‌ అయ్యింది.

Advertisement