Loading...
Instagram posts: పాత ఇన్‌స్టాగ్రామ్ పోస్టుల్లో కూడా ఇప్పుడు పాటను మార్చుకోవచ్చు.. అందుబాటులోకి కొత్త ఫీచర్
పాత ఇన్‌స్టాగ్రామ్ పోస్టుల్లో కూడా ఇప్పుడు పాటను మార్చుకోవచ్చు.. అందుబాటులోకి కొత్త ఫీచర్

Instagram posts: పాత ఇన్‌స్టాగ్రామ్ పోస్టుల్లో కూడా ఇప్పుడు పాటను మార్చుకోవచ్చు.. అందుబాటులోకి కొత్త ఫీచర్

వ్రాసిన వారు Moogati Shabari
Jul 22, 2026
03:11 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇన్‌స్టాగ్రామ్ తన వినియోగదారుల కోసం మరో ఉపయోగకరమైన ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటి వరకు ఇప్పటికే ప్రచురించిన ఫీడ్ పోస్టులు, క్యారసెల్ పోస్టుల్లో ఉపయోగించిన సంగీతాన్ని మార్చాలంటే ఆ పోస్టును తొలగించి మళ్లీ అప్‌లోడ్ చేయాల్సి వచ్చేది. అయితే తాజా అప్‌డేట్‌తో అలాంటి అవసరం లేకుండానే పోస్టులోని పాటను సులభంగా మార్చుకునే అవకాశం కల్పించింది. ఈ కొత్త ఫీచర్‌కు "Replace Audio" అనే పేరును ఇచ్చింది. దీని ద్వారా పోస్టుకు ఇప్పటికే వచ్చిన లైక్‌లు, కామెంట్‌లు, షేర్‌లు, ఇతర ఎంగేజ్‌మెంట్ వివరాలు ఏమాత్రం ప్రభావితం కాకుండా కేవలం బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌ను మాత్రమే మార్చుకోవచ్చు.

వివరాలు

పాటను ఎలా మార్చాలి?

ముందుగా ఇన్‌స్టాగ్రామ్ యాప్‌ను తెరిచి, సంగీతాన్ని మార్చాలనుకుంటున్న ఇప్పటికే ప్రచురించిన ఫీడ్ పోస్ట్ లేదా క్యారసెల్ పోస్ట్‌ను ఓపెన్ చేయాలి.

ఆ తర్వాత కుడి ఎగువ మూలలో కనిపించే రెండు గీతల (టూ-లైన్) మెనూపై ట్యాప్ చేసి 'Edit' ఎంపికను ఎంచుకోవాలి.

అక్కడ కనిపించే 'Replace Audio' ఆప్షన్‌ను సెలెక్ట్ చేస్తే ఇన్‌స్టాగ్రామ్ మ్యూజిక్ లైబ్రరీ తెరుచుకుంటుంది.

అందులో మీకు నచ్చిన కొత్త పాటను ఎంపిక చేసుకుని, ఉపయోగించాలనుకునే భాగాన్ని (సెక్షన్) ఎంచుకుని మార్పులను సేవ్ చేస్తే కొత్త ఆడియో పోస్టుకు జత అవుతుంది.

వివరాలు

గుర్తుంచుకోవాల్సిన విషయాలివే..

ఈ ఫీచర్ ద్వారా పాటను మార్చినా అది కొత్త పోస్టుగా పరిగణించబడదు.

అందువల్ల ఇప్పటికే వచ్చిన లైక్‌లు, కామెంట్‌లు, షేర్‌లు, ఇతర ఎంగేజ్‌మెంట్ వివరాలు యథాతథంగానే కొనసాగుతాయి.

అయితే సంగీతం అందుబాటు ఖాతా రకాన్ని బట్టి మారవచ్చు.

లైసెన్సింగ్ నిబంధనల కారణంగా వ్యక్తిగత (Personal), క్రియేటర్ (Creator), బిజినెస్ (Business) ఖాతాల్లో పాటల లభ్యత ఒకేలా ఉండకపోవచ్చు.

అలాగే పోస్టు చేసిన సమయంలో అందుబాటులో ఉన్న పాట, తర్వాత అన్ని దేశాల్లో లేదా అన్ని రకాల ఖాతాల్లో అందుబాటులో ఉండకపోవచ్చని కూడా గుర్తుంచుకోవాలి.

ADVERTISEMENT