LOADING...
Instagram: ఇన్‌స్టాగ్రామ్‌లో 'యువర్ ఆల్గోరిథమ్' ఫీచర్.. ఇక యూజర్లే తమ ఫీడ్‌ను నియంత్రించుకోవచ్చు!
ఇక యూజర్లే తమ ఫీడ్‌ను నియంత్రించుకోవచ్చు!

Instagram: ఇన్‌స్టాగ్రామ్‌లో 'యువర్ ఆల్గోరిథమ్' ఫీచర్.. ఇక యూజర్లే తమ ఫీడ్‌ను నియంత్రించుకోవచ్చు!

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 11, 2026
12:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉపయోగిస్తున్న ఇన్‌స్టాగ్రామ్‌ తన యూజర్ల కోసం మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. 'యువర్ ఆల్గోరిథమ్ (Your Algorithm)' పేరుతో అందుబాటులోకి రానున్న ఈ ఫీచర్ ద్వారా యూజర్లు తమకు ఎలాంటి కంటెంట్ కనిపించాలో స్వయంగా ఎంపిక చేసుకునే అవకాశం కల్పిస్తోంది. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ హెడ్ ఆడమ్ మొస్సేరీ వెల్లడించారు. ఈ కొత్త ఫీచర్ ద్వారా యూజర్లు తమకు ఆసక్తి ఉన్న అంశాలను ఎంచుకోవడంతో పాటు, వాటిలో మార్పులు కూడా చేసుకోవచ్చు. ప్రస్తుతం ప్రధానంగా టాపిక్‌లను కస్టమైజ్ చేసుకునే అవకాశం మాత్రమే ఉండగా, భవిష్యత్తులో వ్యక్తులు, మూడ్స్‌, కంటెంట్ రకాలు వంటి అంశాలను కూడా ఎంపిక చేసుకునే సౌకర్యాన్ని తీసుకురావాలని ఇన్‌స్టాగ్రామ్ భావిస్తోంది.

వివరాలు 

ఇన్‌స్టాగ్రామ్ అనుభవాన్ని తాము కోరుకున్న విధంగా మార్చుకునే అవకాశం

ఇప్పటికే రీల్స్ ఫీడ్‌, ఎక్స్‌ప్లోర్ పేజీల్లో ఇలాంటి నియంత్రణను కొంతవరకు అందుబాటులోకి తీసుకొచ్చిన ఇన్‌స్టాగ్రామ్, ఇప్పుడు ఈ ఫీచర్‌ను ప్రధాన ఫీడ్‌కూ విస్తరిస్తోంది. యూజర్లకు మరింత స్వేచ్ఛ, వ్యక్తిగత అనుభూతిని అందించడంలో ఇది కీలక అడుగుగా ఆడమ్ మొస్సేరీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక సంస్థగా యూజర్లకు తమ ఇన్‌స్టాగ్రామ్ అనుభవాన్ని తాము కోరుకున్న విధంగా మార్చుకునే అవకాశం ఇవ్వడం ఎంతో అవసరమని అన్నారు. ప్రజలు ఎక్కువ సమయం గడిపే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై వారికి సరైన నియంత్రణ ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు.

వివరాలు 

సోషల్ మీడియాపై చాలా మందిలో అసంతృప్తికి కారణం ఇదే..

సోషల్ మీడియా ఆల్గోరిథమ్‌లు సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందినప్పటికీ, అవి యూజర్లకు కొంత అసౌకర్యాన్ని కలిగిస్తున్నాయని మొస్సేరీ అంగీకరించారు. ప్రస్తుతం యూజర్లు ఏ పోస్టులను చూస్తున్నారు, ఏవాటిని లైక్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు అనే సమాచారాన్ని ఆధారంగా చేసుకుని ఆల్గోరిథమ్ పనిచేస్తోందని, కానీ యూజర్లు తమకు నిజంగా ఏమి కావాలో నేరుగా చెప్పే అవకాశం లేదని తెలిపారు. ఇదే సోషల్ మీడియాపై చాలా మందిలో అసంతృప్తికి కారణమవుతోందన్నారు.

Advertisement

వివరాలు 

అభిరుచులకు అనుగుణంగా కంటెంట్ కనిపించే అవకాశం

ఇక తాజా సాంకేతికత, ముఖ్యంగా లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (LLMs) అందుబాటులోకి రావడంతో పరిస్థితులు మారుతున్నాయని మొస్సేరీ చెప్పారు. ఈ టెక్నాలజీ ద్వారా యూజర్ల ఆసక్తులను సులభంగా అర్థమయ్యే భాషలో వర్గీకరించి చూపించవచ్చని, అలాగే యూజర్లు కూడా తమ అభిరుచులను ప్లాట్‌ఫామ్‌కు స్పష్టంగా తెలియజేయగలరని వివరించారు. దీంతో ఇన్‌స్టాగ్రామ్‌లో యూజర్ల అభిరుచులకు అనుగుణంగా కంటెంట్ కనిపించే అవకాశం మరింత పెరుగుతుందని ఆయన తెలిపారు.

Advertisement