LOADING...
WhatsApp Web: వాట్సాప్ వెబ్‌లో త్వరలో చాట్ థీమ్స్ ఫీచర్
వాట్సాప్ వెబ్‌లో త్వరలో చాట్ థీమ్స్ ఫీచర్

WhatsApp Web: వాట్సాప్ వెబ్‌లో త్వరలో చాట్ థీమ్స్ ఫీచర్

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 13, 2026
10:25 am

ఈ వార్తాకథనం ఏంటి

వాట్సాప్ త్వరలో తన వెబ్ వెర్షన్‌లో కొత్త ఫీచర్‌ను తీసుకురానుంది. ఇకపై వినియోగదారులు చాట్ థీమ్స్‌ను తమ ఇష్టానుసారం మార్చుకునే అవకాశం పొందనున్నారు. ప్రస్తుతం అభివృద్ధిలో ఉన్న ఈ ఫీచర్ ద్వారా వివిధ రంగుల ఎంపికలు అందుబాటులోకి రానున్నాయి. దీని ద్వారా చాట్స్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చుకోవడంతో పాటు కళ్లకు ఇబ్బంది లేకుండా అనుకూలమైన థీమ్స్‌ను ఎంచుకోవచ్చు.

వివరాలు 

మొత్తం 49 విభిన్న థీమ్స్‌ ఎంపిక చేసుకునే అవకాశం 

ఇప్పటివరకు వాట్సాప్ వెబ్‌లో డిఫాల్ట్ వాల్‌పేపర్ మాత్రమే మార్చుకునే అవకాశం ఉండగా, ఈ కొత్త అప్డేట్‌తో మెసేజ్ బబుల్స్ రంగులు, బ్యాక్‌గ్రౌండ్‌ను కూడా మార్చుకునే వీలు ఉంటుంది. సుమారు 49 రకాల థీమ్స్ అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. అయితే, ఒక వినియోగదారు ఎంపిక చేసిన థీమ్ ఇతరులకు కనిపించదు. అది పూర్తిగా వ్యక్తిగత అనుభవంగానే ఉంటుంది. ఇలా iOS, ఆండ్రాయిడ్ తర్వాత ఇప్పుడు వెబ్‌లో కూడా వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపర్చే దిశగా కంపెనీ అడుగులు వేస్తోంది.

Advertisement