Page Loader
Gmailలో స్పామ్ మెయిల్స్‌ను బ్లాక్ చేయడానికి సరికొత్త ఫీచర్ 
Gmailలో స్పామ్ మెయిల్స్‌ను బ్లాక్ చేయడానికి సరికొత్త ఫీచర్

Gmailలో స్పామ్ మెయిల్స్‌ను బ్లాక్ చేయడానికి సరికొత్త ఫీచర్ 

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 22, 2023
04:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

జీ మెయిల్(Gmail) ఆకౌంట్‌కు స్పామ్ ఈ మెయిల్స్ తెగ ఇబ్బంది పెడుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీటిని బ్లాక్ చేయడానికి జీమెయిల్‌లో అన్ సబ్ స్క్రైబ్ బటన్ ను తీసుకొచ్చినట్లు తెలిసింది. ఇది iOS ఫోన్లలో ఈ ఫీచర్ పనిచేస్తుందా అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఒకవేళ పొరపాటున స్పామ్ మెయిల్స్‌ను గెలికితే అవనసరంగా చిక్కుల్లో పడే అవకాశం ఉంది. దీనిపై US-ఆధారిత టెక్ దిగ్గజం గూగుల్ Gmail Android యాప్‌లో కొత్త అన్‌సబ్‌స్క్రైబ్ బటన్‌ను ప్రవేశపెడుతున్నట్లు స్పష్టం చేశారు. ఇది స్పామ్ ఇమెయిల్‌లను బ్లాక్ చేయడానికి సాయపడుతుంది.

Details

ఈ ఫీచర్ తో స్పామ్ మెయిల్స్ కు అడ్డుకట్ట

ఈ సరికొత్త ఫీచర్‌తో స్పామ్ మెయిల్స్ చాలా వరకు తగ్గే అవకాశం ఉందని గూగుల్ పేర్కొంది. మరోవైపు గూగుల్ తన కార్ క్రాష్ డిటెక్షన్ ఫీచర్‌ ను మరిన్ని దేశాలకు విస్తరించింది. కార్ క్రాష్ డిటెక్షన్ ఐఫోన్‌ల కోసం యాపిల్ ఫీచర్ లాగానే పనిచేస్తుంది. కారు క్రాష్ డిటెక్షన్ Android ఫోన్‌లోని సెన్సార్‌లను, ఎప్పుడైనా ప్రమాదానికి గురైతే ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తుంది. ఈ ఫీచర్ ప్రస్తుతానికి పిక్సెల్ ఫోన్‌లకు మాత్రమే అందుబాటులో ఉందని Google స్పష్టం చేసింది