YouTube App: మీ ఫోన్‌లో యూట్యూబ్ లుక్‌ను మీకు నచ్చినట్టుగా మార్చేయండి...
ఈ వార్తాకథనం ఏంటి
ఈ ఏడు ఐకాన్లలో కొన్ని ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాయి. యూట్యూబ్ ప్లే బటన్‌ను నలుపు, తెలుపు రంగుల్లో చూపించే మోనోక్రోమ్ డిజైన్ ఒకటి. మరొకటి పెయింట్ లేదా క్రీమ్ పూతలా కనిపించే ప్రత్యేక ఆకృతితో ఉంది. పాత టీవీల్లో కనిపించే CRT తరహా విజువల్ ఎఫెక్ట్‌తో మరో ఐకాన్‌ను రూపొందించారు. యూట్యూబ్ తొలి లోగోను గుర్తుచేసేలా నలుపు రంగులో 'You', ఎరుపు చతురస్రంలో తెలుపు రంగులో 'Tube' ఉండే డిజైన్ కూడా ఇందులో ఉంది. ప్రారంభ ఐఫోన్ యాప్‌లలో కనిపించిన టీవీ ఆకారపు ఐకాన్‌ను పోలిన మరో డిజైన్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
Details
బీటా వెర్షన్‌లోనే పనిచేస్తున్న ఐకాన్ మార్పు
ఈ కొత్త డిజైన్లు కేవలం పరీక్షల కోసం సిద్ధం చేసిన నమూనాలు మాత్రమే కావని తెలుస్తోంది.
ఆండ్రాయిడ్ అథారిటీ నివేదిక ప్రకారం, తాజా బీటా యాప్‌లో ఈ ఏడు ఐకాన్లను మాన్యువల్‌గా యాక్టివేట్ చేసి మార్చి చూడగలిగారు.
అంటే యూజర్ ఎంచుకున్న డిజైన్‌కు అనుగుణంగా ఫోన్ హోమ్‌స్క్రీన్‌పై ఉన్న యూట్యూబ్ ఐకాన్‌ను మార్చే ప్రాథమిక వ్యవస్థను గూగుల్ ఇప్పటికే సిద్ధం చేసినట్లు కోడ్ విశ్లేషణలో వెల్లడైంది.
Details
సెట్టింగ్స్‌లో ప్రత్యేక ఆప్షన్ వచ్చే అవకాశం
యూట్యూబ్ జనరల్ సెట్టింగ్స్‌లోని 'Appearance' ఆప్షన్ కింద 'App icon' అనే కొత్త సెట్టింగ్ కనిపించినట్లు సమాచారం.
దీని ద్వారా వినియోగదారులు తమకు నచ్చిన ఐకాన్‌ను ఎంచుకునేలా ప్రత్యేక మెనూను తీసుకురావచ్చని అంచనా. అయితే ఈ ఫీచర్ ఇంకా అందరికీ అందుబాటులోకి రాలేదు.
ప్రస్తుతం బీటా వెర్షన్‌లో కనిపిస్తున్న ఈ సదుపాయాన్ని గూగుల్ ఎప్పుడు అధికారికంగా విడుదల చేస్తుందనే దానిపై స్పష్టత లేదు.
అందుబాటులోకి వస్తే యూట్యూబ్ యాప్‌కు వ్యక్తిగతమైన కొత్త రూపాన్ని ఇచ్చే అవకాశం కలుగుతుంది.