YouTube: యూట్యూబ్ కొత్త ఫీచర్.. షార్ట్ వీడియోల స్క్రోలింగ్‌కి 'స్టాప్' చెప్పేందుకు టైమర్!
ఈ వార్తాకథనం ఏంటి
యూట్యూబ్‌లో ఓ చిన్న షార్ట్ ఓపెన్ చేస్తాం, అంతే, గంటల తరబడి స్క్రోల్ చేస్తూ వదలకుండా వీడియోలు చూస్తూనే ఉంటాం. ఈ అలవాటును కంట్రోల్ చేయడానికి యూట్యూబ్ ఇప్పుడు కొత్త టైమర్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా యూజర్లు షార్ట్ వీడియోలు చూడటానికి ప్రతిరోజూ ఒక సమయ పరిమితి (time limit) సెట్ చేసుకోవచ్చు. ఈ టైమర్ లిమిట్ పూర్తయ్యాక, యూజర్ ఫోన్‌లో "ఈరోజు షార్ట్‌ల స్క్రోలింగ్ ఆగిపోయింది" అని ఒక ప్రాంప్ట్ (సందేశం) వస్తుంది. అయితే, ఆ సందేశాన్ని యూజర్ డిస్మిస్ చెయ్యచ్చు, లేదా తన ఇష్టం ఉంటే మళ్లీ కొనసాగించవచ్చు.
వివరాలు
పిల్లల అకౌంట్ నుంచి సమయ పరిమితి సెట్ చేయచ్చు
ఇప్పటివరకు ఈ ఫీచర్ పేరెంటల్ కంట్రోల్స్‌తో లింక్ అవ్వలేదు,అంటే తల్లిదండ్రులు తమ పిల్లలు ఎంతసేపు షార్ట్‌లు చూడాలో కంట్రోల్ చేయలేరు. ఈ ఏడాది చివర్లో ఈ ఫీచర్‌ను పేరెంటల్ కంట్రోల్స్‌ను జోడించాలని ప్లాన్ చేస్తున్నట్లు యూట్యూబ్ చెబుతోంది . ఆ తర్వాత, తల్లిదండ్రులు పిల్లల అకౌంట్ నుంచి సమయ పరిమితి సెట్ చేయగలరు. అప్పుడు టైమర్ పూర్తయిన తర్వాత పిల్లల స్క్రీన్‌పై వచ్చే ప్రాంప్ట్‌ను వారు డిస్మిస్ చేయలేరు. సోషల్ మీడియా యాప్స్‌పై ఇలాంటి 'ఎండ్‌లెస్ స్క్రోల్' డిజైన్‌ల వల్ల డూమ్‌స్క్రోలింగ్ అనే అలవాటు పెరిగిందని గతంలో విమర్శలు వచ్చాయి. రీసెర్చ్ ప్రకారం,ఇది మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని, దృష్టి చెదరటం,నేర్చుకునే సామర్థ్యం తగ్గటం, ఆందోళన పెరగడం వంటి సమస్యలు తలెత్తుతాయని చెబుతోంది.
వివరాలు
ఇంతకుముందు తీసుకున్న చర్యలు:
ఇంకా, ఈ అలవాటు మెదడులోని రివార్డ్ సిస్టమ్‌ను మార్చి, తదుపరి పెద్ద హెడ్లైన్ కోసం ఎదురుచూసేలా చేస్తుందని కూడా నిపుణులు అంటున్నారు. యూట్యూబ్ ముందే యూజర్ల స్క్రోలింగ్ అలవాటును తగ్గించేందుకు కొన్ని ఫీచర్‌లను అందించింది. 1. "Take a Break" ఫీచర్ ద్వారా ప్రతి 15, 30, 60 లేదా 90 నిమిషాలకొకసారి యూజర్‌కి "బ్రేక్ తీసుకోండి" అని రిమైండర్ వస్తుంది. యూజర్ ఆ రిమైండర్‌ను డిస్మిస్ చేసి కొనసాగించాలా, లేక యాప్ క్లోజ్ చేసి విశ్రాంతి తీసుకోవాలా అనే నిర్ణయం తనదే.
వివరాలు
ఇప్పుడే నిద్రకు వెళ్ళండి
2. అలాగే, "Bedtime Reminder" ఫీచర్ ద్వారా యూజర్ ఒక నిద్ర సమయం సెట్ చేసుకోవచ్చు. ఆ టైమ్ వచ్చినప్పుడు యూట్యూబ్ "ఇప్పుడే నిద్రకు వెళ్ళండి" అని సూచిస్తుంది. కానీ, చివరి నిర్ణయం యూజర్‌దే .. వీడియోలు ఆపాలా లేక కొనసాగించాలా అనేది వారి ఇష్టం. మొత్తానికి, యూట్యూబ్ తీసుకొచ్చిన ఈ కొత్త టైమర్ ఫీచర్ స్క్రోలింగ్ అలవాటును తగ్గించి, సమయాన్ని సరిగ్గా వినియోగించుకునేందుకు ఉపయోగపడనుంది.