LOADING...
YouTube: యూట్యూబ్‌లో షార్ట్స్‌ను పూర్తిగా ఆఫ్ చేయొచ్చు.. ఎలాగంటే..?
యూట్యూబ్‌లో షార్ట్స్‌ను పూర్తిగా ఆఫ్ చేయొచ్చు.. ఎలాగంటే..?

YouTube: యూట్యూబ్‌లో షార్ట్స్‌ను పూర్తిగా ఆఫ్ చేయొచ్చు.. ఎలాగంటే..?

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 16, 2026
12:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచంలో ప్రముఖ వీడియో ప్లాట్‌ఫారమ్ అయిన యూట్యూబ్‌ యూజర్ల కోసం కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. ఇకపై షార్ట్స్ వీడియోలను పూర్తిగా ఆఫ్ చేసుకునే అవకాశం అందుబాటులోకి వచ్చింది. గతంలో "షార్ట్స్ ఫీడ్ లిమిట్" ద్వారా కనీసం 15 నిమిషాల వరకు మాత్రమే పరిమితి పెట్టే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు గూగుల్ ఈ ఫీచర్‌ను అప్‌డేట్ చేసి, షార్ట్స్ టైమ్‌ను జీరోకి సెట్ చేసే ఆప్షన్ ఇచ్చింది. అంటే పూర్తిగా షార్ట్స్‌ను నిలిపివేయొచ్చు. ఈ ఫీచర్ టీనేజ్ అకౌంట్స్‌తో పాటు పెద్దవారి అకౌంట్స్‌కి కూడా అందుబాటులోకి వచ్చింది. అయితే గూగుల్ ఫ్యామిలీ లింక్ ద్వారా నిర్వహించే టీన్ అకౌంట్స్‌లో, పేరెంట్స్ షార్ట్స్‌ను జీరోగా సెట్ చేస్తే పిల్లలు పూర్తిగా షార్ట్స్ చూడలేరు.

వివరాలు 

ఫీచర్ ఎలా ఉపయోగించాలంటే..

ఈ ఫీచర్ ఉపయోగించాలంటే యూట్యూబ్ యాప్ ఓపెన్ చేసి, "You" ట్యాబ్‌లోకి వెళ్లాలి. అక్కడ సెట్టింగ్స్‌లో "Time Management" డాష్‌బోర్డ్‌లోకి వెళ్లి "Shorts feed limit" ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. కొత్త అప్‌డేట్ ఉంటే జీరోకి సెట్ చేసే ఆప్షన్ కనిపిస్తుంది. ఈ ఫీచర్‌తో యూట్యూబ్ షార్ట్స్‌కు బ్రేక్ వేయొచ్చు.. అవసరమైతే పూర్తిగా ఆఫ్ చేసుకునే అవకాశం ఉండటం ప్రత్యేకత. ఇప్పటివరకు ఉన్న "Take a Break" వంటి రిమైండర్లతో పోలిస్తే, ఇది మరింత కంట్రోల్ ఇచ్చే ఫీచర్‌గా చెప్పొచ్చు.

Advertisement