LOADING...
YouTube AI Tool To Help Creators: కంటెంట్‌ క్రియేటర్ల సేఫ్టీ కోసం యూట్యూబ్‌ కొత్త టూల్.. ఎలా పనిచేస్తుందంటే?
కంటెంట్‌ క్రియేటర్ల సేఫ్టీ కోసం యూట్యూబ్‌ కొత్త టూల్.. ఎలా పనిచేస్తుందంటే?

YouTube AI Tool To Help Creators: కంటెంట్‌ క్రియేటర్ల సేఫ్టీ కోసం యూట్యూబ్‌ కొత్త టూల్.. ఎలా పనిచేస్తుందంటే?

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 22, 2025
05:39 pm

ఈ వార్తాకథనం ఏంటి

క్రియేటర్ల భద్రతకు మద్దతుగా యూట్యూబ్ కొత్త ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (AI) టూల్‌ను ప్రవేశపెట్టింది. దీన్ని 'లైక్‌నెస్ డిటెక్షన్ టూల్' అని పిలుస్తున్నారు. ఈ టూల్ సహాయంతో ఏఐ ద్వారా సృష్టించబడిన లేదా మార్చబడిన నకిలీ (డీప్‌ఫేక్) వీడియోలను గుర్తించవచ్చు. ఏఐ వినియోగంతో కంటెంట్‌ క్రియేషన్‌ పెరిగిపోతున్న నేపథ్యంలో యూజర్ల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు యూట్యూబ్‌ తెలిపింది. ఈ టూల్ యూట్యూబ్ స్టూడియోలోని 'కంటెంట్ డిటెక్షన్' విభాగంలో అందుబాటులో ఉంటుంది. దీన్ని ఉపయోగించాలంటే, క్రియేటర్లు ముందుగా తమ ఐడీని ధ్రువీకరించుకోవాలి. ఇందులో ఫొటో ఐడీ,చిన్న సెల్ఫీ వీడియోను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. యూట్యూబ్ తెలిపిన ప్రకారం,ఈ టూల్ కంటెంట్ ఐడీలా కాకుండా వ్యక్తి ముఖాన్ని గుర్తించడం ద్వారా పని చేస్తుంది.

వివరాలు 

 వీడియో టైటిల్, ఛానెల్ పేరు, వ్యూస్ వంటి పూర్తి వివరాలు చూడవచ్చు 

సెటప్ సమయంలో అప్‌లోడ్ చేసిన ఫొటో ఆధారంగా సిస్టమ్ కొత్త వీడియోలను స్కాన్ చేస్తూ, మీరు కనిపించే వీడియోలను గుర్తిస్తుంది. ధ్రువీకరణ పూర్తయిన వెంటనే, ఏఐ సృష్టించిన వీడియోలు యూట్యూబ్‌లో కనిపిస్తే క్రియేటర్లకు వెంటనే అలర్ట్ వస్తుంది. అందులో వీడియో టైటిల్, ఛానెల్ పేరు, వ్యూస్ వంటి పూర్తి వివరాలు కూడా చూడవచ్చు. అలాగే, ఆ వీడియో తొలగించడానికి యూట్యూబ్ నేరుగా రిక్వెస్ట్ ఆప్షన్ను అందిస్తుంది. ఈ టూల్ కేవలం ఏఐ ద్వారా మార్చిన వీడియోలను గుర్తించడమే కాకుండా, కాపీహక్కులు ఉల్లంఘించిన వీడియోలపై రిమూవల్ రిక్వెస్ట్ ఫైల్ చేయడం సౌకర్యాన్ని కూడా అందిస్తుంది. ఇది క్రియేటర్లకు తమ అనుమతి లేకుండా వాడిన కంటెంట్‌పై చర్యలు తీసుకునే అవకాశం ఇస్తుంది.

వివరాలు 

 కొంతమంది క్రియేటర్లకు మాత్రమే అందుబాటులో.. 

ప్రారంభంగా, ఈ ఫీచర్ యూట్యూబ్ పార్టనర్ ప్రోగ్రామ్ (YPP) సభ్యులైన కొంతమంది క్రియేటర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ముఖ్యంగా డీప్‌ఫేక్,వ్యక్తిగత సమస్యలు ఎదుర్కొనే క్రియేటర్లకు దీన్ని అందిస్తున్నట్లు చెప్పబడింది. 2026 జనవరి నాటికి అన్ని క్రియేటర్లకు ఈ టూల్ అందుబాటులోకి రాబోతుంది.