LOADING...
Sridhar Vembu: అరట్టై పాపులారిటీ వేళ.. సోషల్ మీడియాకు  శ్రీధర్ వెంబు గుడ్‌బై.. పెండింగ్ పనులపై దృష్టి 
పెండింగ్ పనులపై దృష్టి

Sridhar Vembu: అరట్టై పాపులారిటీ వేళ.. సోషల్ మీడియాకు  శ్రీధర్ వెంబు గుడ్‌బై.. పెండింగ్ పనులపై దృష్టి 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 15, 2025
01:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

జోహో సహ వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు సోషల్ మీడియా నుంచి విరామం తీసుకునే నిర్ణయం తీసుకున్నారు. ఆయన కొన్ని పెండింగ్ పనుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఇకపై ఇతర బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉంటానని కూడా తెలిపారు. సామాజిక మాధ్యమం ఎక్స్ (X) లో తరచూ చురుగ్గా ఉండే శ్రీధర్ వెంబు, తన ఈ నిర్ణయాన్ని అదే వేదిక ద్వారా వెల్లడించారు. ఈ వారం తరువాత సోషల్ మీడియా విరామం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. అంత కఠినమైన నియమాలు తనపై తానే విధించుకోవాల్సి వచ్చినందుకు విచారం వ్యక్తం చేశారు. ఇకపై తాను ఆచరించే విషయాలనే పంచుకుంటానని స్పష్టం చేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సోషల్ మీడియాకు  శ్రీధర్ వెంబు గుడ్‌బై