1 day for IPl: ఒక్క రోజు మాత్రమే.. టైటిల్ ఫేవరెట్‌గా ముంబై ఇండియన్స్?
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 2026 ప్రారంభానికి ఒక్కరోజే మిగిలి ఉండగా, ఈసారి ట్రోఫీని ఎవరు గెలుస్తారన్న ఆసక్తి పెరిగింది. ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు ప్రధాన ఫేవరెట్‌లుగా నిలుస్తున్నాయి. గత సీజన్ ఛాంపియన్ అయిన ఆర్‌సీబీ టైటిల్‌ను కాపాడుకోవడానికి సిద్ధమవుతోంది. అయితే ఈసారి టైటిల్ రేసులో ముంబై ఇండియన్స్ బలంగా కనిపిస్తోంది.
వివరాలు
ముంబై జట్టు బలం ఏమిటి?
ముంబై ఇండియన్స్ జట్టు ఈసారి బలమైన బ్యాటింగ్‌తో పాటు సమతుల్య జట్టుతో బరిలోకి దిగుతోంది.
రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ వంటి స్టార్ బ్యాట్స్‌మెన్ జట్టుకు బలంగా నిలుస్తున్నారు.
హార్దిక్ పాండ్యా ఆల్‌రౌండర్‌గా జట్టుకు కీలకం. మూడో స్థానంలో తిలక్ వర్మ ఉనికి జట్టుకు అదనపు బలం ఇస్తోంది.
బౌలింగ్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా కీలక పాత్ర పోషించనున్నాడు.
ముఖ్యంగా డెత్ ఓవర్లలో అతని ప్రదర్శన జట్టుకు ప్లస్ పాయింట్.
పవర్‌ప్లేలో ట్రెంట్ బౌల్ట్ స్వింగ్ బౌలింగ్ ప్రత్యర్థులను ఇబ్బందులకు గురి చేయగలదు.
వివరాలు
రికార్డులు కూడా ముంబై వైపే..
ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్ అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటి.
మొత్తం 277 మ్యాచ్‌లలో 153 విజయాలు సాధించింది. 5 ఐపీఎల్ టైటిళ్లతో ముంబై అగ్రస్థానంలో ఉంది.
2013, 2015, 2017, 2019, 2020 సంవత్సరాల్లో ట్రోఫీని గెలుచుకుంది.
గత సీజన్‌లో నాలుగో స్థానంలో నిలిచిన ముంబై, క్వాలిఫయర్ 2లో ఓడిపోయింది.
ఈసారి ఆ లోటును పూడ్చుకుని ఆరో టైటిల్‌పై కన్నేసింది.
వివరాలు
ముంబై బెస్ట్ ప్లేయింగ్ ఇదే..
రోహిత్ శర్మ,
ర్యాన్ రికెల్టన్ లేదా క్వింటన్ డీకాక్ (వికెట్ కీపర్),
తిలక్ వర్మ,
సూర్యకుమార్ యాదవ్,
హార్దిక్ పాండ్యా (కెప్టెన్),
విల్ జాక్స్,
నమన్ ధీర్,
మిచెల్ సాంట్నర్,
దీపక్ చాహర్,
ట్రెంట్ బౌల్ట్,
జస్ప్రీత్ బుమ్రా.
ఇంపాక్ట్ ప్లేయర్‌గా శార్దుల్ ఠాకూర్ లేదా మయాంక్ మార్కండే ఉండే అవకాశం ఉంది.