100yrs of Indian Hockey: గ్వాలియర్ నుంచి ప్రపంచకప్ వరకు.. వందేళ్ల మన హాకీ
ఈ వార్తాకథనం ఏంటి
1925 నవంబర్ నెల.భారత హాకీకి ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలన్న ఉద్దేశ్యంతో కొంతమంది క్రీడాభిమానులు గ్వాలియర్‌లో సమావేశమయ్యారు. ఈ సమావేశమే భారత హాకీ సమాఖ్య (మొదట ఐహెచ్‌ఎఫ్, ప్రస్తుతం హాకీ ఇండియా)ఆవిర్భావానికి కారణమైంది. నవంబర్ 7, 1925న ఈ సమాఖ్యకు అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్)నుండి అధికారిక గుర్తింపు లభించింది. ఆ తర్వాత భారత హాకీ రాణించిన తీరు అసాధారణం.మూడేళ్లకే 1928 అమ్‌స్టర్‌డామ్ ఒలింపిక్స్ వచ్చాయి. ఈ పోటీల్లో భారత్ తొలి సారిగా ఒలింపిక్ స్వర్ణం గెలిచి, హాకీ సూపర్‌పవర్ రాకను ఘనంగా చాటింది. ఆ తర్వాత తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. బ్రిటిష్ పాలనలో భారత్‌కు పరిచయమైన హాకీ, ప్రజల్లో వేగంగా ప్రాచుర్యం పొందినా, అంతకుముందు అది నిర్వహించడానికి స్పష్టమైన వ్యవస్థ లేదు.
వివరాలు
వెనుకబడిందిలా..
సమాఖ్య ఏర్పాటుతో దేశంలో హాకీ అభివృద్ధికి పెద్ద ఊతం లభించింది. ఇప్పటి వరకు ఒలింపిక్స్‌లో భారత్ మొత్తం 13పతకాలు గెలుచుకోగా,అందులో 8స్వర్ణపతకాలు ఉన్నాయి. అదనంగా,భారత్ ఒకసారి ప్రపంచకప్‌ను కూడా సాధించింది. ప్రపంచాన్ని ఆకట్టుకున్న భారత హాకీ తరువాతి దశల్లో తన పటిమను, మెరుగైన స్థాయిని క్రమంగా కోల్పోయింది. 1975లో ఎఫ్‌ఐహెచ్ ఆస్ట్రో టర్ఫ్ ను ప్రవేశపెట్టడం భారత హాకీకి కీలక మలుపు. టర్ఫ్ నేలపై ఆడటం కోసం కావాల్సిన నైపుణ్యం,శారీరక ధోరణులకు మన జట్టు త్వరగా అలవాటు పడలేదు. నిధుల కొరత కారణంగా దేశంలో టర్ఫ్ మైదానాల ఏర్పాటు కూడా ఆలస్యం అయింది. మాజీ హాకీ ఆటగాడు జగ్బీర్ సింగ్ చెప్పినట్లుగా.. భారత్ టర్ఫ్‌లో నైపుణ్యం సంపాదించేలోపు ఇతర జట్లు చాలా ముందుకుపోయాయి.
వివరాలు
వెనుకబడిందిలా..
దీంతో, 1984 నుండి 2016 వరకు ఒలింపిక్స్‌లో భారత్ ఒక్క పతకమూ గెలవలేకపోయింది. ఇక 2008లో అయితే, ఒలింపిక్స్‌కు అర్హత సాధించలేకపోవడం భారత హాకీ చరిత్రలో అత్యంత నిరాశజనక ఘట్టంగా నిలిచింది. ఇదేకాకుండా, దేశమంతటా క్రికెట్ క్రేజ్ పెరగడం కూడా హాకీకి దూరాన్ని పెంచింది. కానీ గత వదిన 10 ఏళ్లలో హాకీ మళ్లీ పునర్‌జీవం పొందింది. 2016 ఒలింపిక్స్‌లో పతకం రాకపోయినా, క్వార్టర్‌ఫైనల్ చేరడం ఉత్సాహాన్నిచ్చింది. నాలుగు దశాబ్దాల తర్వాత 2020 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించడం భారత హాకీకి తిరిగి విజయం వైపు తొలి అడుగైంది. తదుపరి 2024 పారిస్ ఒలింపిక్స్‌లో కూడా కాంస్యం సాధించి, భవిష్యత్తుపై కొత్త ఆశలు రేకెత్తించింది.
వివరాలు
స్వర్ణయుగం
ఈ రోజు భారత్ ప్రపంచ నంబర్ వన్ జట్టు కాకపోయినా, ఎదుర్కోవడానికి కఠినమైన, బలమైన జట్టు గా నిలిచింది. గత వైభవాన్ని మళ్లీ అందుకోవడానికి జట్టు క్రమంగా ముందుకు సాగుతోంది. హాకీలో భారత్ ప్రదర్శించిన ప్రభావం, ఆధిపత్యం మరే ఇతర క్రీడలో చూడటం కష్టమే. 1926లో జరిగిన మొదటి విదేశీ పర్యటనలో భారత్, న్యూజిలాండ్‌లో 21 మ్యాచ్‌ల్లో 18 గెలిచి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఈ పర్యటనలోనే హాకీ చరిత్రలో చిరస్థాయిగా గుర్తుండిపోయే ధ్యాన్‌చంద్ అరంగేట్రం చేశారు.
వివరాలు
స్వర్ణయుగం
1928 నుండి 1956 వరకూ వరుసగా ఆరు ఒలింపిక్ స్వర్ణాలు.. ఇది ఇంతవరకు మరే ఇతర జట్టు సాధించలేని రికార్డు. తరువాత 1964, 1980 ఒలింపిక్స్‌లో కూడా భారత్ విజేతగా నిలిచింది. అదే విధంగా 1975లో ప్రపంచ కప్‌ను కూడా భారత్ తన పేరుపై ముద్ర వేసుకుంది. ధ్యాన్‌చంద్, బల్బీర్ సింగ్ వంటి లెజెండ్స్ ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించారు. వారి ప్రతిభ, క్రీడాస్ఫూర్తి, ఆటతీరు భారత హాకీకి చిరస్థాయి గౌరవం తెచ్చాయి.