Loading...
Hong Kong Sixes 2026: 12 సిక్స్‌లు.. 3 ఫోర్లు.. 3.5 ఓవర్లలోనే భారత్‌ను చిత్తు చేసిన పాకిస్థాన్!
12 సిక్స్‌లు.. 3 ఫోర్లు.. 3.5 ఓవర్లలోనే భారత్‌ను చిత్తు చేసిన పాకిస్థాన్!

Hong Kong Sixes 2026: 12 సిక్స్‌లు.. 3 ఫోర్లు.. 3.5 ఓవర్లలోనే భారత్‌ను చిత్తు చేసిన పాకిస్థాన్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 30, 2026
02:15 pm

ఈ వార్తాకథనం ఏంటి

హాంగ్‌కాంగ్ వేదికగా జరుగుతున్న హాంకాంగ్ సిక్సెస్ 2026 టోర్నమెంట్‌లో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన పోరులో టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గ్రూప్-సిలో భాగంగా మాంగ్‌కాక్‌లోని మిషన్ రోడ్ గ్రౌండ్‌లో జరిగిన హై-వోల్టేజ్ మ్యాచ్‌లో పాకిస్థాన్ 4 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది. బ్యాటింగ్‌లో శశాంక్ సింగ్ మెరుపు ఇన్నింగ్స్ ఆడినప్పటికీ, పాక్ బ్యాటర్లు విధ్వంసకరంగా చెలరేగడంతో భారత జట్టు నిర్దేశించిన లక్ష్యం సరిపోలేదు. కేవలం 3.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి పాకిస్థాన్ ఘన విజయం సాధించింది.

వివరాలు

శశాంక్ సింగ్ విధ్వంసం.. భారత్ 88/5

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్థాన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.

దీంతో మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు నిర్ణీత 6 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 88 పరుగులు చేసింది. ఓపెనర్ రాహుల్ త్రిపాఠి 5 బంతుల్లో 2 ఫోర్ల సాయంతో 9 పరుగులు చేసి వెనుదిరిగాడు.

మరో ఓపెనర్ నితీష్ రాణా 14 బంతుల్లో ఒక ఫోర్, రెండు సిక్సర్లతో 19 పరుగులు చేసి రిటైర్డ్ ఔట్‌గా పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన శశాంక్ సింగ్ పాకిస్థాన్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు.

కేవలం 11 బంతుల్లోనే 2 ఫోర్లు, 5 భారీ సిక్సర్లతో 40 పరుగులు సాధించాడు. 363.64 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసి భారత స్కోరును పెంచాడు.

వివరాలు

వరుస బంతుల్లో ఔటైన రాహుల్ తెవాతియా, కెప్టెన్ కృనాల్ పాండ్య

అయితే స్టార్ ప్లేయర్లు రాహుల్ తెవాతియా, కెప్టెన్ కృనాల్ పాండ్య వరుస బంతుల్లో డకౌట్‌గా వెనుదిరగడం టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బగా మారింది.

చివర్లో టి. నటరాజన్ 6 బంతుల్లో 2 ఫోర్లతో 12 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. దీంతో భారత్ నిర్ణీత 6 ఓవర్లలో 88/5 స్కోరు సాధించింది.

పాకిస్థాన్ బౌలర్లలో అబ్దుల్ సమద్ తన ఒక ఓవర్లో 10 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. అహ్మద్ దానియల్, ముహమ్మద్ షెహజాద్ చెరో వికెట్ సాధించారు.

ADVERTISEMENT

వివరాలు

23 బంతుల్లోనే లక్ష్యం ఛేదించిన పాక్

భారత్ నిర్దేశించిన 89 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్‌కు కెప్టెన్ అబ్బాస్ అఫ్రిది, వికెట్ కీపర్ ఖవాజా నాఫే అదిరిపోయే ఆరంభాన్ని అందించారు.

తొలి ఓవర్ నుంచే భారత బౌలర్లపై విరుచుకుపడుతూ సిక్సర్ల వర్షం కురిపించారు. అబ్బాస్ అఫ్రిది కేవలం 8 బంతుల్లోనే ఒక ఫోర్, 5 సిక్సర్లతో 35 పరుగులు చేశాడు.

అతడి స్ట్రైక్ రేట్ 437.50గా నమోదైంది. మరోవైపు ఖవాజా నాఫే కూడా ఏమాత్రం తగ్గలేదు. కేవలం 12 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లతో 41పరుగులు బాదాడు.

వీరిద్దరి దూకుడుతో మ్యాచ్ పూర్తిగా పాకిస్థాన్ వైపు మళ్లింది. ఆ తర్వాత అబ్దుల్ సమద్ 7పరుగులు, ఇర్ఫాన్ ఖాన్ 6 పరుగులు చేసి మిగిలిన లాంఛనాన్ని పూర్తి చేశారు.

ADVERTISEMENT

వివరాలు

భారత బౌలర్లపై పాక్ బ్యాటర్ల దాడి

దీంతో పాకిస్థాన్ కేవలం 3.5 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి 91 పరుగులు సాధించింది. మరో 13 బంతులు మిగిలి ఉండగానే 4 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది.

పాకిస్థాన్ బ్యాటర్ల దూకుడుకు భారత బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. కెప్టెన్ కృనాల్ పాండ్య వేసిన తొలి ఓవర్లోనే ఏకంగా 31పరుగులు సమర్పించుకున్నాడు.

టి. నటరాజన్ కూడా 28 పరుగులు ఇచ్చాడు. శశాంక్ సింగ్ 14పరుగులు ఇచ్చి ఒక వికెట్ పడగొట్టగా, రాహుల్ తెవాతియా కూడా ఒక వికెట్ సాధించాడు.

అయినప్పటికీ పాక్ బ్యాటర్ల విధ్వంసాన్ని అడ్డుకోలేకపోయారు. బ్యాటింగ్‌లో 8 బంతుల్లో 35 పరుగులు చేయడంతో పాటు బౌలింగ్‌లోనూ రాణించిన పాకిస్థాన్ కెప్టెన్ అబ్బాస్ అఫ్రిదికి 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది.

ADVERTISEMENT