LOADING...
KKR : 13 ఖాళీ స్లాట్లు, రూ.64.3 కోట్లు చేతిలో… కేకేఆర్ టార్గెట్ మాత్రం ఆ ముగ్గురు ' విదేశీ ' కీపర్లే!
13 ఖాళీ స్లాట్లు, రూ.64.3 కోట్లు చేతిలో… కేకేఆర్ టార్గెట్ మాత్రం ఆ ముగ్గురు ' విదేశీ ' కీపర్లే!

KKR : 13 ఖాళీ స్లాట్లు, రూ.64.3 కోట్లు చేతిలో… కేకేఆర్ టార్గెట్ మాత్రం ఆ ముగ్గురు ' విదేశీ ' కీపర్లే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 17, 2025
02:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు కోల్‌కతా నైట్ రైడర్స్ భారీ మార్పులతో అందరినీ ఆశ్చర్యంలో ముంచింది. మొత్తం తొమ్మిది మంది ఆటగాళ్లను రిలీజ్ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అందులో ఆండ్రీ రస్సెల్, వెంకటేష్ అయ్యర్, క్వింటన్ డి కాక్, రహ్మానుల్లా గుర్బాజ్ వంటి స్టార్ ప్లేయర్స్‌ను రిలీజ్ చేయడం ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చింది. ఇప్పుడు, కేకేఆర్ మినీ వేలం ద్వారా జట్టును తిరిగి బలపరచే దిశగా అడుగులు వేస్తోంది.

Details

వికెట్ కీపర్ కీలక లోటు

గత సీజన్‌లో జట్టులో ఇద్దరు వికెట్ కీపర్లు—క్వింటన్ డి కాక్, రహ్మానుల్లా గుర్బాజ్—ఉన్నా వీరిద్దరినీ రిటైన్ చేయకుండా రిలీజ్ చేశారు. డి కాక్ ధర రూ. 3.6 కోట్లు, గుర్బాజ్ రూ. 2 కోట్లు. దీంతో ఇప్పుడు KKRకి అత్యవసరంగా ఒక బలమైన వికెట్‌కీపర్-బ్యాట్స్‌మన్ అవసరం ఏర్పడింది. ఈ లోటును భర్తీ చేసేందుకు, వేలంలో మూడు ప్రముఖ విదేశీ ఎంపికలను పరిశీలించే అవకాశం ఉంది. వీరందరూ టీ20 ఫార్మాట్‌లో టాప్ క్లాస్ వికెట్‌కీపర్-బ్యాట్స్‌మెన్.

Details

కేకేఆర్ పరిశీలిస్తున్న మూడు వికెట్ కీపర్ ఎంపికలు

1. టిమ్ సీఫెర్ట్ (న్యూజిలాండ్) న్యూజిలాండ్‌కు చెందిన అగ్రశ్రేణి ఓపెనర్. టీ20ల్లో వేగంగా స్కోర్లు చేసే నైపుణ్యం. న్యూజిలాండ్ తరఫున 77 టీ20ల్లో 1850 పరుగులు (avg 29.98), 12 ఫిఫ్టీలు, హై స్కోర్ 97. మొత్తం 293 టీ20ల్లో 6698 పరుగులు, 4 సెంచరీలు, 32 ఫిఫ్టీలు. * ఫుల్‌టైమ్ వికెట్‌కీపర్‌గా కేకేఆర్‌కు మంచి ఎంపిక .

Details

2. జోష్ ఇంగ్లిస్ (ఆస్ట్రేలియా) 

గత సీజన్‌లో పంజాబ్ కింగ్స్ కోసం ఆడాడు, ఈసారి విడుదలయ్యాడు. ఏ స్థానంలోనైనా అగ్రెస్సివ్‌గా బ్యాటింగ్ చేసే సామర్థ్యం. ఆస్ట్రేలియా తరపున 41 టీ20ల్లో 911 పరుగులు (SR 159.26), 2 సెంచరీలు, 2 ఫిఫ్టీలు. మొత్తం 162 టీ20ల్లో 3853 పరుగులు, 4 సెంచరీలు, 20 ఫిఫ్టీలు. KKR మిడిల్ ఆర్డర్‌ను బలపరచగల అత్యుత్తమ ఎంపిక.

Details

3. డెవాన్ కాన్వే (న్యూజిలాండ్) 

చెన్నై సూపర్ కింగ్స్ గతంలో కీలక ఆటగాడు, కానీ ఈ సారి రిలీజ్ చేశారు. వేలంలో భారీ డిమాండ్ ఉండే అవకాశం. న్యూజిలాండ్ తరపున 62 టీ20ల్లో 1,675 పరుగులు, 12 ఫిఫ్టీలు. మొత్తం 220 టీ20ల్లో 6,858 పరుగులు, 2 సెంచరీలు, 54 ఫిఫ్టీలు. ఓపెనింగ్ & మిడిల్ ఆర్డర్‌కు సరిగ్గా సరిపోయే క్లాస్ ప్లేయర్. మొత్తం గా, కేకేఆర్ వేలంలో ఈ ముగ్గురు వికెట్ కీపర్లలో ఒకరిని తీసుకునే అవకాశం చాలా ఎక్కువ. జట్టులో వికెట్ కీపింగ్ విభాగాన్ని బలోపేతం చేయడమే వారి ప్రాథమిక లక్ష్యం.