Team India: 20 జట్లు, 5 వేదికలు.. టీ20 ప్రపంచకప్ 2026కు వేదికలు ఖరారు..!
ఈ వార్తాకథనం ఏంటి
వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో భారత్-శ్రీలంక సంయుక్త ఆతిథ్యంతో జరగనున్న ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026 కోసం వేదికల ఎంపిక దాదాపుగా పూర్తయింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, కీలక మ్యాచ్‌ల వేదికలపై స్పష్టత లభించింది. ముఖ్య వేదికలు & మ్యాచ్‌లు ఫైనల్ మ్యాచ్ ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ఫైనల్ పోరుకు వేదిక కానుంది. ఓపెనింగ్ మ్యాచ్ టోర్నమెంట్ ఆరంభ పోటీ కూడా ఇదే స్టేడియంలో జరగనున్నట్లు తెలుస్తోంది. సెమీఫైనల్ మ్యాచ్‌లు ఒక సెమీఫైనల్ ముంబై వాంఖడే స్టేడియంలో జరగనుంది. అయితే శ్రీలంక జట్టు సెమీఫైనల్‌కి అర్హత సాధిస్తే, ఆ మ్యాచ్‌ను కొలంబో వేదికగా మార్చే అవకాశం ఉంది
Details
భారత్‌లోని ఇతర వేదికలు
అహ్మదాబాద్, ముంబైతో పాటు ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై నగరాలను కూడా మ్యాచ్‌ల కోసం షార్ట్‌లిస్ట్ చేశారు. ప్రతి వేదికలో కనీసం 6 మ్యాచ్‌లు నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే తెలుగు రాష్ట్రాల అభిమానులకు నిరాశ ఎదురైంది. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం, విశాఖపట్నం స్టేడియాలు ఈ జాబితాలో చోటు దక్కించుకోలేకపోయాయి. పాకిస్థాన్ మ్యాచ్‌ల పరిస్థితి భారత్-పాకిస్థాన్‌ల మధ్య ఉన్న రాజకీయ ఉద్రిక్తతల కారణంగా పాకిస్థాన్ జట్టు ఆడే అన్ని మ్యాచ్‌లను శ్రీలంక వేదికల్లో నిర్వహించాలని నిర్ణయించారు. ఒకవేళ పాకిస్థాన్ జట్టు ఫైనల్‌కి చేరితే తుదిపోరు అహ్మదాబాద్‌లో కాకుండా కొలంబోలో జరగనుంది.
Details
టోర్నమెంట్ ఫార్మాట్ & వివరాలు
జట్లు: ఈసారి మొత్తం 20 జట్లు పాల్గొననున్నాయి — ఇది టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే అత్యధికం. ఫార్మాట్: 20 జట్లను ఐదు జట్ల చొప్పున నాలుగు గ్రూపులుగా విభజిస్తారు. ప్రతి గ్రూపులో టాప్-2 జట్లు సూపర్-8 దశకు అర్హత పొందుతాయి. అనంతరం సెమీఫైనల్స్, ఫైనల్ మ్యాచ్‌లు జరుగుతాయి. ఐసీసీ (ICC) త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి అధికారిక షెడ్యూల్ ను విడుదల చేయనుంది