
సెంచరీలతో చెలరేగిన గిల్, శ్రేయాస్, స్యూర్య సిక్స్‌ల మోత.. టీమిండియా స్కోరు 399
ఈ వార్తాకథనం ఏంటి
వన్డేలో శుభమన్ గిల్, శ్రేయాస్ అయ్యర్ సెంచరీలతో అదరగొట్టారు. మిస్టర్ 360 ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ సిక్స్‌లతో మోత మోగించాడు.
ఫలితంగా టీమిండియా నిర్ణీత 50ఓవర్లలో 399 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా జట్టుకు 400 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించేంది.
తొలుత టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు.
టీమిండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఓపెర్లుగా గిల్, గైక్వాడ్ ఇన్నింగ్ ప్రారంభించారు.
8పరుగులు చేసి గైక్వాడ్ రనౌట్ అయ్యాడు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన శ్రేయాస్.. గిల్‌తో కలిసి పరుగుల వరద పారించారు. ఇద్దరు సెంచరీలతో రెచ్చిపోయారు.
ఈ ఇద్దరు రెండవ వికెట్‌కు సరిగ్గా 200 పరుగులు జోడించారు.
టీమిండియా
ఆసీస్ బౌలర్లను ఊచకోత
శ్రేయాస్ అయ్యర్, గిల్ ద్వయం ఆసీస్ బౌలర్లను ఊచకోత కోశారు. వరుసగా సిక్సులు, ఫోర్లతో సెంచరీలు సాధించారు.
శ్రేయాస్ 90 బంతుల్లో 105 పరుగులు (11 ఫోర్లు, 3 సిక్సర్లు) చేసి ఔటయ్యాడు. అలాగే గిల్ కూడా 97 బంతుల్లో 104 పరుగులు (6 ఫోర్లు, 4 సిక్సర్లు) సాధించాడు.
ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన కెప్టెన్ కేఎల్ రాహుల్ 52 పరుగులతో మెరుపులు మెరిపించారు.
ఇషాన్ ఔట్ అయ్యాక క్రీజులోకి వచ్చిన సూర్య సిక్సులతో అదరగొట్టారు.
గ్రీన్ బౌలింగ్ లో సూర్య ఏకంగా వరుసగా 4 సిక్సులు బాది ఔరా అనిపించుకున్నాడు. మొత్తంగా 6సిక్సులు 6 ఫోర్లతో కేవలం 32బంతుల్లో సూర్య 72 పరుగులతో అదగొట్టాడు.