LOADING...
Irfan Pathan : ఒక నిమిషంలో 3 పోస్టులు.. పాక్‌పై సెటైర్లు వేసిన ఇర్ఫాన్ పఠాన్
ఒక నిమిషంలో 3 పోస్టులు.. పాక్‌పై సెటైర్లు వేసిన ఇర్ఫాన్ పఠాన్

Irfan Pathan : ఒక నిమిషంలో 3 పోస్టులు.. పాక్‌పై సెటైర్లు వేసిన ఇర్ఫాన్ పఠాన్

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 22, 2025
09:47 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆసియా కప్ 2025లో టీమిండియా-పాకిస్తాన్ సూపర్-4 మ్యాచ్ అనంతరం భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ చేసిన పోస్టులు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. భారత్ విజయం సాధించగానే, ఆయన వరుసగా మూడు పోస్టులు చేసి అభిమానుల దృష్టిని ఆకర్షించారు. భారత్-పాక్ మ్యాచ్‌లు కేవలం మైదానంలోనే కాకుండా అభిమానులు, మాజీ క్రికెటర్ల మధ్య కూడా తీవ్ర చర్చలకు దారి తీస్తాయి. ఇర్ఫాన్ పఠాన్, పాకిస్తాన్ అభిమానుల మధ్య ఈ వైరం ఎప్పటినుంచో కొనసాగుతూనే ఉంది. ఈసారి భారత్ పాక్‌ను ఓడించడంతో, పఠాన్ మరోసారి సెటైర్లు వేసే అవకాశం వదులుకోలేదు.

Details

పఠాన్ మూడు పోస్టులు ఇవే

మొదటి పోస్ట్(రాత్రి 12 గంటలకు) తిలక్ వర్మ అద్భుతమైన ఫినిషింగ్‌ను ప్రశంసిస్తూ "తిలక్ వర్మ అద్భుతమైన ఫినిషింగ్" అని రాశారు. కీలక సమయాన జట్టును విజయతీరాలకు చేర్చిన తిలక్‌ను ప్రత్యేకంగా గుర్తించారు. రెండో పోస్ట్(కొన్ని సెకన్ల తర్వాత) టీమిండియా క్లాస్ ఎప్పటికీ పైనే అంటూ పోస్ట్ చేశారు. ఈ సందేశంతో భారత జట్టు స్థాయి, ప్రదర్శనను పాకిస్తాన్‌తో పోలిస్తే ఎంత ఉన్నతంగా ఉందో సూచించారు. మూడో పోస్ట్(రాత్రి 12:01 గంటలకు) "హాజీ, కైసా రహా సండే?" అంటూ రాశారు. నేరుగా పాకిస్తాన్ పేరు ప్రస్తావించకపోయినా, ఇది పాకిస్తాన్ అభిమానులను ఉద్దేశించి చేసినదనని స్పష్టమైంది. మ్యాచ్ ఆదివారం జరిగిన దృష్ట్యా, పాకిస్తాన్ ఓటమి నేపథ్యంలో ఈ పోస్ట్ మరింత వైరల్ అయింది.

Details

పఠాన్-పాక్ వైరం 

ఇది కొత్తేమీ కాదు. ఇర్ఫాన్ పఠాన్ గతంలో కూడా పాకిస్తాన్‌పై సెటైర్లు వేశారు. 2022 టీ20 ప్రపంచకప్‌లో భారత్ పాక్‌ను ఓడించిన తర్వాత ఆయన "పడోసీ కాష్ అచ్చి ఫీల్డింగ్ కర్ లేతే" అని చేసిన పోస్ట్ పెద్ద వివాదానికి దారి తీసింది. అప్పట్లో పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు కూడా తీవ్రంగా స్పందించారు. ఈ నేపథ్యంతో పఠాన్-పాక్ మధ్య ఈ విరోధం కొనసాగుతూనే ఉంది. మ్యాచ్ ఫలితం ఈ మ్యాచ్‌లో భారత్ పాకిస్తాన్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ విజయంతో పాటు ఇర్ఫాన్ పఠాన్ చేసిన పోస్టులు, భారత్-పాక్ మధ్య ఎప్పటికీ ఉండే ఉత్కంఠను మరలా చాటి చెప్పాయి.