LOADING...
Gujarat Titans: గుజరాత్ జట్టును ఆపడం కష్టమే.. కప్‌పై బలమైన పట్టు..ఆశలు పెంచుతున్న 3 ప్రధాన కారణాలివే
గుజరాత్ జట్టును ఆపడం కష్టమే.. కప్‌పై బలమైన పట్టు..ఆశలు పెంచుతున్న 3 ప్రధాన కారణాలివే

Gujarat Titans: గుజరాత్ జట్టును ఆపడం కష్టమే.. కప్‌పై బలమైన పట్టు..ఆశలు పెంచుతున్న 3 ప్రధాన కారణాలివే

వ్రాసిన వారు Moogati Shabari
May 22, 2026
10:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

గుజరాత్ టైటాన్స్ జట్టు ఐపీఎల్ 2026లో సరైన సమయంలో అద్భుతమైన ప్రదర్శన చేస్తోంది. ఇటీవల చెన్నై సూపర్ కింగ్స్ పై 89 పరుగుల భారీ విజయాన్ని నమోదు చేసి తమ సత్తా చాటుకుంది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో ఒకటిని ఖాయం చేసుకుంది. లీగ్ దశను 14 మ్యాచ్‌లలో 9 విజయాలతో ముగించిన గుజరాత్, ఈసారి టైటిల్ సాధించే ప్రధాన జట్లలో ఒకటిగా నిలిచింది. ఇప్పుడు గుజరాత్ జట్టు విజేతగా నిలిచే అవకాశాలను బలపరుస్తున్న మూడు ముఖ్య కారణాలను తెలుసుకుందాం.

వివరాలు

ఆరంభ జోడీలు వీరే..

సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ ఈ సీజన్‌లో గుజరాత్‌కు బలమైన ఆరంభ జోడీగా నిలిచారు. చెన్నైపై జరిగిన మ్యాచ్‌లో వీరిద్దరూ కలిసి సాధించిన ఏడో శతక భాగస్వామ్యం జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. సాయి సుదర్శన్ ఈ సీజన్‌లో 49.07 సగటుతో 638 పరుగులు చేయగా, గిల్ 47.38 సగటుతో 616 పరుగులు సాధించాడు. ముఖ్యంగా ఈ ఇద్దరూ వేగంగా పరుగులు సాధిస్తూ ప్రత్యర్థులపై ఒత్తిడి పెంచుతున్నారు. ఇక మూడో స్థానంలో ఆడుతున్న జోష్ బట్లర్ కూడా నిరంతరం మంచి ప్రదర్శన ఇస్తున్నాడు. అతడు ఈ సీజన్‌లో 39.08 సగటుతో 469 పరుగులు సాధించి జట్టుకు మరింత బలం చేకూర్చాడు.

వివరాలు

బలమైన బౌలింగ్ దళం..

బౌలింగ్ విభాగంలో రబాడ, మహమ్మద్ సిరాజ్ కొత్త బంతితో అద్భుతమైన జోడీగా నిలిచారు. ఇప్పటివరకు రబడా 24 వికెట్లు తీసుకొని అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ల జాబితాలో ముందున్నాడు. మధ్య ఓవర్లలో ప్రసిధ్ క్రిష్ణ, రషీద్ ఖాన్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. వికెట్లు తీయడంలో వీరందరికీ మంచి నైపుణ్యం ఉండటంతో ప్రత్యర్థి జట్లు పెద్ద భాగస్వామ్యాలు నెలకొల్పడంలో ఇబ్బందులు పడుతున్నాయి.

Advertisement